పాలిచ్చే తల్లుల తీసుకోవలసిన ఆహారం

స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు ఆహారం విషయంలో తీసుకొనే శ్రద్ద ప్రసవానంతరం తీసుకోరు. స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అలాగే ప్రసవం తర్వాత కూడా బిడ్డకు పాలిచ్చే సమయంలో అంత కన్నా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు తల్లి పాలకు మించిన ఆహారం ఉండదు. బిడ్డకు తల్లి పాలు ఇవ్వటం వలన కలిగే లాభాలతో పాటు తల్లులు తీసుకోవలసిన ఆహారం గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది.
శిశువు శరీరంలో రోగ నిరోదకత శక్తి పెరిగి,ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. తల్లి పాలలో ఉండే విటమిన్స్,మినరల్స్  శిశువు జీర్ణ శక్తి పెరుగుతుంది. తల్లి పాలలో ఉండే ఐరన్ కణాల పెరుగుదలకు దోహదం చేస్తుంది.
బిడ్డకు పాలు ఇస్తున్నంత కాలం తల్లి సాధ్యమైనంత వరకు ఎక్కువగా ద్రవ పదార్దాలను తీసుకోవాలి. పాలు,పళ్ళరసాలు,నీరు వంటివి సాద్యమైనంత వరకు తీసుకుంటూ ఉండాలి. అన్ని రకాల ఆహార పదార్దాలను నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే వాటిలో ఐరన్, కాల్షియం అదికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
పచ్చి బఠానీలు,మెంతి కూర,పాలకూర,మొక్కజొన్న,బీట్ రూట్ వంటి వాటిలో కనీసం  ప్రతి రోజు రెండు రకాలు ఉండేలా చూసుకోవాలి. నీటిలో సోడియం శాతం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది పిల్లల జీర్ణ క్రియ మీద తీవ్ర  ప్రభావం చూపుతుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top