కీళ్ళ నొప్పులు తగ్గటానికి....కొన్ని సులభమైన చిట్కాలు

కొన్ని సహజ ప్రక్రియల ద్వారా కూడా ఈ బాధల నుంచి విముక్తి పొందవచ్చు.


రోజూ వ్యాయామాలు చేయాలి. కీళ్ల మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా తేలికపాటి వ్యాయామాలు చేస్తే మంచిది. ఫలితంగా కీళ్ల కదలికలు సులువవడంతోపాటు అక్కడి కండరాలు కూడా పటిష్టమవుతాయి. 

దీంతో మోకాళ్లు బలంగా తయారవుతాయి. నొప్పులతో బాధపడే వాళ్లకు నడక చాలా మంచిది. నడక వల్ల కీళ్లపై ఒత్త్తిడి సడలుతుంది. ఆర్థ్రరైటిస్‌ వల్ల సంభవించే బాధలు కూడా తగ్గుతాయి.


శరీరంలో నొప్పులున్న చోట మాగ్నటిక్‌ థెరపీ మంచి ఫలితాలను చూపిస్తుంది. నొప్పి ఉన్న చోట రక్తప్రసరణ , ఆక్సిజన్‌ బాగా పెరిగేట్టు ఈ థెరపీ చేస్తుంది.


వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాలు బిగుసుపోవడం లాంటి బాధలు ఉండవు. వేడినీళ్ల వల్ల ఆర్థ్రరైటిస్‌ పెయిన్‌ కూడా తగ్గుతుంది. హాట్‌ షవర్స్‌ చేయొచ్చు.


ధ్యానం ద్వారా శరీరంలో ఉన్న ఒత్తిడి హార్మోన్లను తగ్గించవచ్చు. అంతేకాదు కొన్ని రకాల ధ్యాన పద్ధతుల ద్వారా మన బ్రెయిన్‌ దృష్టి నొప్పి మీద పడకుండా చేయొచ్చు.




ఎక్కువ నీరు తాగితే కార్టిలేజ్‌ మృదువుగా మారుతుంది. దానికి కావాల్సినంత నీరు అందుతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోని రక్త ప్రమాణం దెబ్బతినదు. ఫలితంగా పోషకాలు రక్తం ద్వారా కీళ్లకు అంది దృఢంగా ఉంటాయి. 

ఆయుల్‌ మసాజ్‌ వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. కండరాలు తేలికపడతాయి. జాయిం ట్స్‌ బిగుసుకుపోవడం లాంటి సమస్యలు ఎదురుకావు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top