పరుగెత్తండి......... బరువు తగ్గండి

కొంతమంది ఉదయం వాకింగ్ చేసే సమయంలో చాలా హడావిడిగా ఉండటం సహజమే. ఈ హడావిడి అంతా బరువు తగ్గటానికే. అయితే వాకింగ్ కన్నా రన్నింగ్ మంచిదని నిపుణులు అంటున్నారు. అయితే రన్నింగ్ చేయటానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

పరుగెత్తటం ఎలా ప్రారంభించాలి?

* ప్రారంభంలో ఎక్కువసేపు వేగంగా పరుగు తీయకుండా ముందు ఒక ఐదు నిముషాల పాటు జాగింగ్ చేసి,ఆ తర్వాత పరుగు ప్రారంభించాలి.

*ఒకేసారి కిలో మీటర్ దూరం పరిగెత్తకూడదు. ముందుగా 50 మీటర్లు లేదా 100 మీటర్లు పరిగెత్తాలి. నిదానంగా ఈ దూరాన్ని మరియు వేగాన్ని పెంచాలి. ప్రతి రోజు పరుగెత్తటం సాధ్యం కానీ వారు వారంలో రెండు రోజుల పాటు పరుగెత్తటం చేయాలి.
* ఆందోళన,ఒత్తిడి ఉన్న సమయంలో పరుగెత్తటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీటితో బాధపడుతున్నప్పుడు వేగాన్ని తగ్గించుకొని నిదానంగా పరుగెత్తటం చేయాలి.

* అదే విధంగా ముని వేళ్ళ మీద ఎప్పుడు పరుగు తీయకూడదని నిపుణులు చెప్పుతున్నారు. వేళ్ళ మీద పరుగెత్తటం వలన వేగం రాదు. అంతేకాకుండా అనుకున్న పలితాన్ని సాదించలేరు.


* చాలా మంది ఏదో పోటిలో పాల్గొనట్టు పరుగెడతారు. అలా ఎప్పుడు పరుగెట్టకూడదని నిపుణులు చెప్పుతున్నారు. నిదానంగా,రిలాక్స్ గా పరుగెత్తాలి.

* పరుగెత్తటం ప్రారంభించి నిదానంగా వేగం పుంజుకున్న తర్వాత రోజుకి గంట పాటు పరుగెత్తటం మంచిది.

* రోజుకి గంట చొప్పున వారంలో ఐదు రోజులు మానకుండా పరుగెడితే తక్కువ సమయంలోనే మంచి పలితాన్ని పొందవచ్చు.

* అయితే ఆహారం తీసుకున్న తర్వాత పరుగేత్తకూడదు. ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వత మాత్రమే పరుగెత్తాలి.

* పరుగు ప్రారంభించటానికి వేకువ జామునే మంచిదని నిపుణులు అంటున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top