కృష్ణ భగవాన్ జీవితంలో షాక్ కలిగించే నిజాలు

కృష్ణ భగవాన్ అసలు పేరు పాపారావు చౌదరి. కృష్ణ భగవాన్ టాలీవుడ్ హాస్య ప్రముఖులలో ఒకడు. కృష్ణ భగవాన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో కైకవోలు అనే చిన్న గ్రామంలో జూలై 2, 1965 వ సంవత్సరంలో జన్మించాడు. 

కృష్ణ భగవాన్ తల్లిదండ్రులు మీనావల్లి వీర్రాజు,లక్ష్మీకాంతం. కృష్ణ భగవాన్ విద్యాభ్యాసం మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్లో జరిగింది. పొలాలు,పిల్ల కాలువ దాటి స్కూల్ కి వెళ్ళేవాడు.

CLICKHERE : హీరోయిన్ టబు గురించి నాగార్జున చెప్పిన షాకింగ్ విషయాలు

కృష్ణ భగవాన్ తన పాఠశాల చదువు పూర్తయ్యాక తన ఉన్నత విద్య కోసం కాకినాడ వెళ్ళాడు.

కృష్ణ భగవాన్ ఆండాళ్ళమ్మలకు కాలేజ్ లో ఇంటర్మీడియట్, బాగ్ లింగంపల్లి అంబేద్కర్ డిగ్రీ కళాశాలలో కామర్స్ (B.Com) డిగ్రీని పొందాడు.

ఆ తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గి నటన మీద ఆసక్తి పెంచుకున్నాడు. కృష్ణ భగవాన్ పాఠశాల రోజులలోనే డ్రామాలు వేసేవాడు. కృష్ణ భగవాన్ సినిమాల్లో నటించాలనే కోరికతో చెన్నై వెళ్లగా, అక్కడ మొదటిసారిగా దర్శకుడు క్రాంతి కుమార్ స్క్రీన్ టెస్ట్ చేసాడు. ఆ టెస్ట్ లో 300 మంది పాల్గొంటే కృష్ణ భగవాన్ ని ఎంపిక చేసారు. అయితే ఆ సినిమా ఆగిపోయింది.


CLICKHERE : ఇండియాలో ఫెమస్ మరియు సంపన్న దేవాలయాలు

ఆ తర్వాత వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' సినిమాలో నటించాడు. ఆ తరవాత వంశీ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన 'ఏప్రిల్ 1 విడుదల' సినిమాలో నటించాడు. అంతేకాక కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ రచయితగా కూడా పనిచేసాడు. 

అలాగే హీరోగా కూడా ఒకటి రెండు సినిమాలు చేసాడు. దాదాపుగా 250 సినిమాల్లో నటించాడు. కృష్ణ భగవాన్ భార్య పేరు లక్ష్మి. వీరికి ఒక పాప ఉంది.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top