చైతూ 'మాస్టర్ ప్లాన్' వర్క్ అవుట్ అవుతుందా?

నాగచైతన్య, సమంతా ప్రేమ వ్యవహారం పెళ్లి పీటలు ఎక్కే ఈ మధ్య సమయంలో రోజుకో ట్విస్ట్ తో అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ వార్తల్లో నిజానిజాలు ఎలా ఉన్నా అభిమానుల్లో మాత్రం చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. 

ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఎంగేజ్ మెంట్ డేట్ ను రాబోతున్న సెప్టెంబర్ నెలలో పెట్టమని తన తండ్రి నాగార్జునకు నాగ చైతన్య చెప్పినట్టు సమాచారం.


Naga chaitnya master plan in telugulifestyle

సెప్టెంబర్ నెలలో ఎంగేజ్ మెంట్ పెట్టటం వెనక నాగ చైతన్య మాస్టర్ ప్లాన్ ఉంది. సెప్టెంబర్ నెలలో నాగ చైతన్య సినిమా 'ప్రేమమ్' విడుదల ఉంది. ఆ సమయానికల్లా ఎంగేజ్ మెంట్ అయ్యిపోతే సినిమాకి సమంతా చేత ప్రమోషన్స్ చేయిస్తే సినిమాకి ప్లస్ అవటమే కాకుండా భారీగా కలెక్షన్స్ సాధించవచ్చని చైతూ ఆలోచన. 


అయితే చైతూ, సమంతా పెళ్లి విషయంలో నాగార్జున ఒక నిర్ణయానికి వచ్చినా, చైతూ చెప్పిన విధంగా అడుగులు వేస్తాడో లేదో అనుమానమే. ఏది ఏమైనా ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఇలా రోజుకొక వార్త హల్ చల్ చేస్తూ ఉంటుంది. 




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top