అతివల కోసం అరుదైన చిట్కాలు

హెయిర్‌ పిన్స్‌ టిక్‌ టక్‌ డబ్బాలో వేసి పెట్టుకుంటే అవసరానికి టక్కున అందుకోవచ్చు.


హెయిర్‌ పిన్స్‌ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే హెయిర్‌ స్ర్పే చేయాలి.

హ్యాంగర్‌కు షవర్‌ కర్టెన్‌ రింగులు తగిలించి వాటికి స్కార్ఫ్‌లు వేలాడదీయొచ్చు.

తలుపుల వెనక వైరు బుట్టలు బిగించుకుంటే వాటిలో పర్సులు, కళ్లజోళ్లు, స్కార్ఫ్‌లు, కవర్లు ఉంచుకోవచ్చు.

ఆర్టిఫిసియల్‌ జ్యువెలరీ వల్ల శరీరం రంగు మారకుండా ఉండాలంటే వాటి అడుగున క్లియర్‌ నెయిల్‌ పాలిష్‌ వేయాలి.

జుట్టుకు ఉపయోగించే ఫ్లాట్‌ ఐరన్‌తో కర్చీఫ్‌ను కూడా ఐరన్‌ చేయొచ్చు.

వెంట్రుకలు తడి ఆర్పుకునేటప్పుడు చిక్కులు పడకుండా ఉండాలంటే టవల్‌ బదులుగా టీషర్ట్‌ ఉపయోగించండి.

లెదర్‌ షూల మీద ముడతలు పోవాలంటే వేజిలీన్‌ దూదితో అప్లై చేయాలి.


కాళ్లు కోమలంగా మారాలంటే మొదట షేవ్‌ చేసి ఆలివ్‌ ఆయిల్‌, చక్కెర కలిపి స్క్రబ్‌ చేయాలి. మళ్లీ షేవ్‌ చేయాలి. 

అప్పుడు మిగిలిపోయిన మృత కణాలు కూడా తొలిగిపోతాయి. దాంతో చర్మం కోమలంగా తయారవుతుంది.

కాంపాక్ట్‌ డబ్బాల్లో దూదితో తయారైన ప్యాడ్స్‌ ఉంచితే అవి విరిగిపోకుండా ఉంటాయి.

దుస్తుల మీద పడిన రెడ్‌ వైన్‌ మరకలను వైట్‌ వైన్‌తో వదిలించొచ్చు. 

తాళాలు తేలికగా గుర్తుపెట్టుకోవాలంటే వాటికి వేర్వేరు రంగుల నెయిల్‌పాలిష్‌లు వేయాలి. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top