చిన్న వయస్సులో చనిపోయిన హీరోయిన్స్

టాలీవుడ్ లో మంచి మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన చాలా మంది హీరోయిన్స్ చాలా చిన్న వయస్సులోనే చనిపోయారు. వారి నటనతో చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.

ప్రత్యూష తెలుగు,తమిళ భాషల్లో నటించిన ప్రత్యూష తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. హైదరాబాద్ కేర్ ఆసుపత్రి కి సిదార్ధ, ప్రత్యూష ని 2002 పిబ్రవరి 25 రాత్రి 8 గంటలకు తీసుకువచ్చి ఇద్దరం పురుగుల మందు తాగామని చెప్పాడు. అయితే ప్రత్యూష మాత్రం చికిత్స తీసుకుంటూ చనిపోయింది. కెరీర్లో అప్పుడే ఎదుగుతున్న ప్రత్యూష మరణం మిస్టరీగా ఉండిపోయింది.

CLICKHERE : టమాటా సాస్ గురించి మనకు తెలియని భయంకరమైన నిజాలు

భార్గవి
టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ముద్రను వేసుకొని అష్టాచెమ్మా సినిమాలో రెండవ హీరోయిన్ గా వెండితెర మీద కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. కెరీర్ లో ఒక గుర్తింపు ప్రారంభం అయ్యే సమయంలో అనుమానాస్పద స్థితిలో మరణించింది.

మధుబాల
మధుబాల 9 సంవత్సరాల వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు గుండె సమస్య ఉంది. ఒక రోజు షూటింగ్ లో ఆమె పరిస్థితి విషమించి 36 సంవత్సరాలకే లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.
సిల్క్ స్మిత సిల్క్ స్మిత అసలు పేరు విజయ లక్ష్మి. ఈమె మరణించే వరకు అవివాహితగానే ఉంది. ఈమె 1996, సెప్టెంబరు 23 న మద్రాసులో ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.
సౌందర్య
కన్నడ భామ అయిన సౌందర్య తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగింటి అమ్మాయిగా అందరికి సుపరిచితం అయింది. 2004 లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బిజెపీకి ప్రచారం చేస్తూ ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించింది.
స్మితా పాటిల్
స్మితా పాటిల్ మహారాష్ట్రలో అక్టోబర్ 17, 1955 జన్మించారు. ఈమె మొత్తం 80 హిందీ, మరాఠి చిత్రాలలో కన్పించారు. ఈమె రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డులు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకుంది. ఈమె అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ని అందుకున్నారు. స్మితా పాటిల్ 31 సంవత్సరాలకే చనిపోయింది. ఆమె చైల్డ్ బర్త్ కాంప్లికేషన్ వల్ల డిసెంబరు 13, 1986 లో మరణించింది.
దివ్యభారతి ఫిబ్రవరి 25, 1974 మహారాష్ట్రలో జన్మించిన దివ్య భారతి ఉత్తరాది నుంచి తెలుగుకు వచ్చింది. నిర్మాత రామానాయుడు బొబ్బిలి రాజా సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం చేసాడు. ఆమె మొదటి సినిమా వెంకటేష్ తో నటించింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయస్సులో అనుమానాస్పదంగా మరణించింది. ఇప్పటికీ ఆ మిస్టరీ వీడలేదు.
ఆర్తి అగర్వాల్
ఆర్తి అగర్వాల్ 14 సంవత్సరాల వయస్సులోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. వెంకటేష్ తో జతకట్టి 'నువ్వునాకు నచ్చావ్' అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు అందరితోనూ జోడి కట్టింది. ఆ తర్వాత స్థూలకాయశ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఆర్తీ అమెరికా వెళ్ళి అక్కడ చికిత్స తీసుకుంది. జూన్ 4, 2015 న అమెరికాలో సర్జరీ వికటించడంతో గుండెపోటు వచ్చి జూన్ 6, 2015 న మరణించింది.

1 2 3


CLICKHERE : నోటి దుర్వాసనను తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు

CLICKHERE: టాలీవుడ్ భామల బరువు ఎంతో తెలుసా?

CLICKHERE : అల్యూమినియం ఫాయిల్స్ లో చుట్టిన ఆహారం తింటే ఏమవుతుందో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top