సౌందర్య తో తనకు సాన్నిహిత్యం ఉంది అన్న అలనాటి రూమర్ల పై ప్రతిస్పందిస్తూ జగపతి ఆరోజుల్లో మీడియా తనకూ సౌందర్య కు చాలాసార్లు పెళ్లి ముహూర్తాలు పెట్టేసిందని, అంతేకాదు కొంతమంది అయితే ఏకంగా తన భార్యకే ఫోన్ చేసి ఫలానా రోజు ఫలానా టైం కి తనకూ సౌందర్య కు పెళ్లి అని చెప్పేసేవారని....
CLICKHERE : హీరో విక్రమ్ అలవాట్లు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
CLICKHERE : ఉదయం 9 గంటల లోపు మీరు చేసే 9 తప్పులు
CLICKHERE : టాలీవుడ్ హీరోయిన్స్ ఎత్తు ఎంత తెలుసా ???
CLICKHERE : వండిన ఆహారాన్ని 48 నిమిషాల లోపల తినకపోతే ఏమవుతుందో తెలిస్తే షాక్
CLICKHERE : నీతా అంబానీ లైఫ్ స్టైల్ చూస్తే కళ్ళు జిగేల్‌మనాల్సిందే
CLICKHERE : ఆల్కహాలులో ముంచిన దూదిని బొడ్డులో పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?
అయితే ఆ రూమర్స్ విని తనకు నవ్వాలో ఏడవాలో తెలిసేది కాదని అంటూ తనకు సౌందర్య ఖచ్చితంగా క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం తన భార్య కు కూడా తెలుసు అని, సౌందర్య ఎంత క్లోజ్ ఫ్రెండ్ గా ఉండేదో సౌందర్య అన్నయ్య అమర్ కూడా తనతో సన్నిహితంగా ఉండేవాడని చెప్పాడు.
అలాగే ఒకసారి తను ఎయిర్ పోర్ట్ కు తన చుట్టాలను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళితే అదే ఫ్లైట్ లో సౌందర్య వచ్చింది కాబట్టి తాను సౌందర్య కోసం వచ్చానంటూ రాతలు రాశారని చెపుతూ తన నట జీవితంలో సౌందర్య లాంటి మంచి అమ్మాయి ని చూడలేదని, తనకు ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నప్పుడు ఒకసారి అవసరం అయితే సౌందర్య సోదరుడు అమర్ అడగకుండానే డబ్బు ఇచ్చి ఆదుకున్నాడని, అంత మాత్రం చేత తనకూ సౌందర్య కు ఏదో ఉందని రాయడం ఇప్పటికీ తాను జీర్ణించుకోలేక పోతున్నానని....
అలాగే సౌందర్య కాకుండా మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్ కూడా తన కుటుంబానికి సన్నిహితురాలని అంత మాత్రం చేత ఆమె కు తనకు మధ్య రాతలు రాస్తే ఎలా అంటూ ప్రశ్నించాడు జగపతి.
ఇదే ఇంటర్వ్యూ లో జగపతి బాబు మాట్లాడుతూ,”పెళ్లి అనేది ఒక అనుబంధం అని, తాను కట్నం తీసుకోలేదు అలాగే తన కుమార్తెలకు కూడా కట్నం ఇవ్వను అని చెపుతూ, తనకు దేవుడు అంటే నమ్మకం ఉన్నా ముఖ్యంగా మనశ్శాంతి కోసం సాయి బాబా గుడికి వెళ్తే గుడికి వచ్చిన వాళ్ళంతా బాబా ను చూడకుండా తనను చూస్తూ ఉండిపోతారని, అందుకని వీలైనంత వరకూ తాను గుడి, గోపురాలకు వెళ్లనని” చెపుతున్నాడు.
తాను పరిశ్రమకు వచ్చి 30 ఏళ్ళు ధాటిపోయినా ఏ దర్శకుడి ని తనకు అవకాశాలు ఇవ్వమని ఇప్పటివరకూ అడగలేదని, భవిష్యత్ లో కూడా అడగనని చెపుతున్న జగపతి బాబు నిజయితీగా బ్రతకడంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకుంటే ఏ మనిషి కైనా ఆనందం అదే వస్తుందని అంటూ మరెన్నో ఆశక్తికర విషయాలు తన అంతరంగం గురించి వివరించాడు ఫ్యామిలీ హీరో జగపతి బాబు.