గారెలూ, బూరెలూ ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే....

గారెలూ, బూరెల్లాంటివి నూనెలో వేయించుకోవడం తప్పనిసరే కానీ, కొన్ని చిన్న చిన్న చిట్కాలతో ఆ నూనె వినియోగాన్ని కొంతవరకూ తగ్గించవచ్చు.
గారెలను మినపప్పుతో కాకుండా సెనగపప్పుతో ప్రయత్నిస్తుంటే.. ఆ పిండిని కాస్త పల్చగా చేసుకుని పెనంమీద లేదా బాణలిలో వేసుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకోవచ్చు. లేదూ గారెలే చేసుకోవాలని అనుకుంటే మాత్రం... నూనె ఎంపిక నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్ లో దొరికే ప్రతి నూనె వేపుళ్లకు పనికిరాదు. 

CLICKHERE : తట్టుకోలేని కడుపు మంట వస్తుందా?? సెకండ్లలో తగ్గించే టెక్నిక్…

రైస్‌ బ్రాన్‌, సన్‌ఫ్లవర్‌, సన్ ఫ్లవర్, వేరుశనగ నూనె వంటి వాటిని ఎంచుకోవాలి. లేదంటే నూనెలో రసాయనాలు విడుదలై.. పదార్థం కాలిన వాసన రావడమే కాకుండా ఆరోగ్యానికీ కూడా మంచిది కాదు.

బాణలిలో నూనె పోసి బాగా కాగనివ్వాలి. అప్పుడు గారె లేదా బూరె వేసినప్పుడు వెంటనే బయటి భాగం కాలి, దానిలోని నీరు బయటకు పోయి బుడగలు వస్తాయి. ఆ తరవాత అది వేగి, దాని చుట్టూ కరకరలాడే పొర ఏర్పడుతుంది. ఆ తరవాత మంట తగ్గిస్తే లోపలి భాగం కూడా పూర్తిగా వేగుతుంది. అలాగే తక్కువ నూనెను పీల్చుకుంటాయి.

CLICKHERE : బుల్లి తెరను హీటెక్కిస్తున్న హాట్ యాంకర్స్

అలా కాకుండా నూనె కాగకుండానే పిండిని వేస్తే.. నీరు నెమ్మదిగా బయటకు పోయి గాలి లోపలికి చేరి.. ఆ పదార్థం వేగినప్పుడు ఎక్కువ నూనె పీల్చుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల పదార్థం కూడా సాగినట్లు వస్తుంది.

ఈ రోజుల్లో మెటల్‌ బాస్కెట్లు దొరుకుతున్నాయి. దాని అడుగున పల్చని జాలిలా ఉంటుంది. బాణలిలో నూనె పోసాక ఈ మెటల్‌ బాస్కెట్‌ను అందులో ఉంచాలి. ఈ బాస్కెట్‌లో గారె లేదా బూరె వేస్తే.. ఏదయినా పదార్థం చిట్లినా కూడా ఆ బాస్కెట్‌లోనే ఉంటుంది. ఈ బాస్కెట్లు ఒకటి నుంచి పది గారెలు వేగించుకొనేందుకు వీలుగా ఉంటుంది.

CLICKHERE : పెయిన్ కిల్లర్ కాంబిఫ్లేమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

అలాగే పకోడీలూ, బజ్జీల్లాంటివి చేసేటప్పుడు ఆ పిండిలో రెండు లేదా మూడు చెంచాల బియ్యప్పిండి కలిపితే కరకరలాడేలా రావడమే కాకుండా నూనె ను తక్కువగా పీల్చుకుంటాయి.

తోపు పిండిగా మైదాను ఎన్నిక చేసుకున్నప్పుడు కొంచెం బియ్యప్పిండి కలుపుకోవాలి. అప్పుడు చేసే పిండి వంటలు నూనెను తక్కువ పీల్చుతాయి.

CLICKHERE : టాలీవుడ్ హీరోయిన్స్ ఎత్తు ఎంత తెలుసా ???

CLICKHERE : మహేష్ పెళ్ళిలో ట్విస్ట్ తెలిస్తే...షాక్

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top