టాలీవుడ్ స్టార్ల‌కు రెడ్డి వైఫ్‌లు

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోల కులాలను బట్టి సినిమాలు ఆడుతున్నాయి. వాటికి తగ్గట్లే ఫ్యాన్స్ కూడా ఎక్కువభాగం సదరు సామాజిక వర్గానికి చెందినవారే ఉంటారు. కానీ పెళ్లి అనే సాంప్రదాయం వచ్చేసరికి కులాల మధ్య అంతరాలు తొలగిపోతున్నాయి. వారు నాయుడు, కాపు సామాజిక వర్గం అయినా…. వచ్చే భార్యలు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమ పెళ్ళిళ్ళు కూడా అధికంగా ఉన్నాయి. స్టార్ హీరోల భార్యలు అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడం యాదృచ్చికం.

CLICKHERE : అన‌సూయ ల‌గ్జ‌రీ కారు రేటు తెలిస్తే షాకే..

మొదటిసారిగా మంచువారి ఇంట చూసుకుంటే మోహ‌న్‌బాబు కొడుకు హీరో విష్ణు… వైఎస్ సోద‌రుడి కుమార్తె వెరోనికా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కవలపిల్లలు పుట్టారు. ఆ తరువాత అల్లు వారసుడు అల్లు అర్జున్ కూడా స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఇప్పుడు ఒక బాబు పుట్టాడు.. మరొకరు త్వరలో రానున్నారు. 


CLICKHERE : ఈ సింపుల్ టెక్నిక్ తో ... 45 సెకండ్లలో తల నొప్పి పరార్...!!!

ఇక బన్నీ మేనమామ మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్‌చ‌ర‌ణ్ కూడా అపోలో హాస్పెటల్ చైర్మెన్ ప్రతాప్ రెడ్డి మనుమరాలు ఉపాస‌న రెడ్డిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. ఇద్దరూ కూడా ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. ఆ తరువాత మంచువారింటిలోనే మరో రెడ్డి కోడలు వచ్చి చేరింది. మంచు మనోజ్ కూడా వదిన వెరోనికా రెడ్డి స్నేహితురాలు ప్రణ‌తిరెడ్డిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు.

CLICKHERE : గారెలూ, బూరెలూ ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే....

ఇదే కుటుంభంలో మరో ఆదర్శ వివాహం కూడా మొదట జరిగింది. అదే మంచు లక్ష్మి ప్రసన్న భర్త ‘అండీ’ బ్రామ్మనుడు కావడం విశేషం. అంతే కాదు తాజాగా మరో రెడ్డి కోడలు కింగ్ నాగార్జున ఇంట అడుగుపెట్టనుంది. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్‌రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. 

CLICKHERE : తట్టుకోలేని కడుపు మంట వస్తుందా?? సెకండ్లలో తగ్గించే టెక్నిక్…

వీరికి డిసెంబర్ 8న నిశ్చితార్థం జరగనుంది. ఈ అమ్మాయి ఎవరోకాదు జీవీకే రెడ్డి మ‌న‌వరాలు కావడం గమనార్హం. ఇలా యంగ్ హీరోలు అంతా రెడ్డి భార్యలను తెచ్చుకుంటున్నారు. తమకు కులాల అంతరం లేదని చాటి చెబుతున్నారు.

CLICKHERE : బుల్లి తెరను హీటెక్కిస్తున్న హాట్ యాంకర్స్

CLICKHERE : పెయిన్ కిల్లర్ కాంబిఫ్లేమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top