శ్రీముఖి గురించి మీకు తెలియని నిజాలు

శ్రీముఖి.. తెలుగు యాంక‌రింగ్ ప్ర‌పంచంలో దూసుకుపోతున్న స‌రికొత్త రాకెట్‌. క‌ళ్లుతిప్పుకోలేని గ్లామ‌ర్‌, గ‌ల‌గ‌ల మాట‌లు, చ‌క్క‌ని స‌మ‌య‌స్ఫూర్తి, అంత‌కుమించి తెలివితేట‌లు.. ఇంకేం కావాలి. అందుకే, తెలుగు యాంక‌రింగ్ ప్ర‌పంచంలో ఎంత‌మంది ఉన్నా.. త‌క్కువ టైమ్‌లోనే తన‌తైన ముద్ర వేసింది శ్రీముఖి. అయితే, స్కూల్ టాప‌ర్ అని మీకు తెలుసా? 

CLICKHERE : 7 రోజుల పాటు ఉదయాన్నే వెల్లుల్లి, తేనె తినడం వల్ల పొందే బెన్ఫిట్స్

టెన్త్‌, ఇంట‌ర్‌లో ఆమెకు 95 ప‌ర్సెంట్‌కి పైగా మార్కులు వ‌చ్చాయి. ఇంట‌ర్‌లో బైపీసీ చ‌దివిన ఆమె ఎమ్‌సెట్‌ రాసింది. ఎమ్‌సెట్ మిస్ అయినా.. బీడీఎస్ సీట్ వ‌చ్చింది. ఇల్లే ప్ర‌పంచం ఆమెకు. ఆమె టాలెంట్‌ని చూసి అంతా డాక్ట‌ర్ అవుతుంద‌ని భావించారు. కానీ, బీడీఎస్ సీటుతో స‌రిపెట్టుకుంది.


CLICKHERE : బిర్యాని తినేటప్పుడు కూల్‌ డ్రింక్స్ తాగుతున్నారా..??

శ్రీముఖి ఫ్యామిలీ నార్త్ నుంచి వ‌చ్చి నిజ‌మాబాద్‌లో సెటిల‌యింది. తండ్రి రామ‌కృష్ణ గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయి. త‌ల్లి ల‌త బ్యూటీషియ‌న్‌. బీడీఎస్ సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతున్న ఆమె ఒక‌రోజు ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే హోం మినిస్ట‌ర్ కార్యక్ర‌మానికి వ‌చ్చింది. అక్క‌డ ఆమెను చూసిన ఆ ప్రోగ్రామ్ డైరెక్ట‌ర్‌.. యాంక‌రింగ్ చేయించొచ్చు కదా శ్రీముఖి ఫ్యామిలీని అడిగార‌ట‌. దీనికి మొద‌ట అంగీక‌రించ‌ని శ్రీముఖి తండ్రి.. ఆ త‌ర్వాత ఒత్తిడి చెయ్య‌డంతో ఒప్పుకున్నారట‌. దీంతో, బీడీఎస్‌కి కామా పెట్టి యాంక‌రింగ్‌లోకి వ‌చ్చింది. మొద‌ట అదుర్స్ ప్రోగ్రామ్‌తో యాంక‌రింగ్ షురూ చేసింది. ఆ ప్రోగ్రామ్ హిట్ అయింది.

CLICKHERE : అబార్షన్ గురించి ఖచ్చితంగా ... తెలుసుకోవలసిన విషయాలు

అయితే, నార్త్ నుంచి వ‌చ్చిన ఫ్యామిలీ కావ‌డంతో మొద‌ట ఆమెకు తెలుగుతో స‌త‌మ‌త‌మ‌య్యేద‌ట‌. దీంతో, ఉద‌యం లేవ‌గానే పేప‌ర్‌ల‌న్నీ ముందేసుకొని కూర్చొనేద‌ట‌. అదుర్స్ ప్రోగ్రామ్‌లో ఆమెను చూసిన ప్రేమ ఇష్క్ కాద‌ల్ డైరెక్ట‌ర్‌.. వెంట‌నే.. ఆ సినిమాలో హీరోయిన్‌గా అడిగార‌ట‌. 

మ‌ళ్లీ తండ్రి అడ్డుచెప్పినా ఒప్పించి మ‌రీ సినిమాలో యాక్ట్ చేసింది శ్రీముఖి. ఆ త‌ర్వాత ఆమె యాంక‌ర్‌గానే ఎక్కువ చాన్స్‌లు రావ‌డంతో బుల్లితెర‌పై బిజీ అయిపోయింది. ‘అదుర్స్‌’, ‘అదుర్స్‌2’, ‘మనీమనీ’, ‘సూపర్‌మామ్‌’, ‘సూపర్‌సింగర్స్‌ 9’, ‘పటాస్‌’ వంటి కార్యక్రమాలెన్నో చేశా. ఇటు బిగ్ స్క్రీన్‌పై ‘నేను.. శైలజ..’ ‘జులాయి’, ‘ఆంధ్రాపోరి’ ‘జెంటిల్‌మన్‌’ వంటి సినిమాల్లోనూ నటించింది.

CLICKHERE : అభిమానులకు కన్నీళ్లు పెట్టిస్తున్న జగపతి బాబు రియల్ లైఫ్

ఇప్పుడు అప్‌క‌మింగ్ హీరోల‌కు ఆమె సూప‌ర్ సిస్ట‌ర్‌గా మారిపోయింది.ఇన్ని ప్రోగ్రామ్‌లు చేసినా.. త‌న‌కు న‌చ్చిన ప్రోగ్రామ్ మాత్రం ప‌టాస్ అట‌. ఇందులో స్క్రిప్ట్ ఏమీ ఉండ‌దు. స్పాంటేనియ్ టాలెంట్ ప్ర‌ద‌ర్శించాలి. అందుకే, ప‌టాస్ త‌న‌కు పాంచ్ పటాకా అంటోంది శ్రీముఖి. ప‌టాస్ ప్రోగ్రామ్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వీట‌న్నింటినీ ప‌క్క‌న‌పెడితే.. త్వ‌ర‌లో కామా పెట్టిన బీడీఎస్‌ని పూర్తి చెయ్యాల‌ని భావిస్తోంద‌ట‌. ఇదీ టోట‌ల్‌గా ఆమె గురించిన డీట‌యిల్స్‌..

CLICKHERE : రోజూ రెండుసార్లు మజ్జిగ తాగండి.. బరువు తగ్గండి!

CLICKHERE : మహేష్ గురించి తెలిస్తే షాక్ అవుతారు 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top