క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. హర్భజన్ కూతురు హినాయా హీర్‌తో కలసి సర దాగా గడిపిన ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.చిన్నారి హీర్‌ను ఎత్తుకుని మాస్టర్ ముద్దు చేస్తున్నాడు. ‘చిన్నారి హినాయా హీర్ సంతోషాల గని’ అని టెండూల్కర్ ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలను హర్భజన్ భార్య గీతా బస్రా కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. మాస్టర్ బయోపిక్ ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ విడుదల తేదీ ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ దృశ్యాలు చోటు చేసుకున్నాయి.