లేటెస్ట్ న్యూస్: గవర్నమెంట్ నిర్ణయంతో హార్ట్ వైద్యం ఇప్పుడు డెడ్ చీప్.. అందరికీ తెలియచేయండి!!

దేశంలో ఇప్పుడు అత్యధిక మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో గుండె వ్యాధులు టాప్ ప్లేస్ లోకి వస్తున్నాయి. వైద్యానికి అయ్యే ఖర్చు కూడా లక్షల్లోనే ఉంటుంది. గుండెకు వచ్చే వ్యాధుల్లో వాల్స్ బ్లాక్ కావడం చాలా ప్రధానమైంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు రక్తనాళాలు మూసుకుపోవడం తెలిసిందే. మూసుకుపోయిన వాల్స్ కు స్టెంట్లు వేసి యాక్టివ్ చేస్తే మినహా హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ బతకడు. ఇది ఒకటి, రెండు రోజుల్లో జరిగిపోవాలి. దానికి ఎంతలేదన్నా రూ.2-5 లక్షల వరకు ఆసుపత్రి రేంజ్ ను బట్టి ఖర్చవుతుంది. 

అయితే ప్రభుత్వం మీ గుండెను పది కాలాలపాటు పదిలంగా కాపాడుకునేలా గొప్ప నిర్ణయం తీసుకుంది. గుండెజబ్బు బాధితులకు ఉపశమనం కలిగించే ఈ నిర్ణయాన్ని జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్‌పీపీఏ) తాజాగా వెల్లడించింది. గుండె రక్తనాళాలు మూసుకుపోతున్న పరిస్థితుల్లో గుండెపోటు రాకుండా నిరోధించేందుకు ఉపయోగించే ‘స్టెంట్ల’ రేట్లను పది రెట్లు తగ్గించేసింది.

ఫిబ్రవరి 13వతేదీ నుంచే స్టంట్ల రేట్లు తగ్గించి అమ్మాలని ఆదేశాలు:

* గతంలో స్టంట్ ధర: రూ60వేలు నుంచి రూ.2.5లక్షలు
* ఇప్పుడు: మందుపూత లేని(బేర్‌ మెటల్‌) స్టెంట్‌ ధర రూ.7,260.
* మందుపూతతో పాటు రక్తనాళాల్లో కరిగిపోయే(బయోరిసోర్బబుల్‌ వాస్కులర్‌ స్కాఫోల్డ్‌) స్టెంట్ ధర రూ.29,600లు మాత్రమే. అంతకిమించి అమ్మడానికి లేదు.
* ఫిబ్రవరి 13వ తేదీనుంచే మార్కెట్ లో అమ్మకానికి ప్యాక్ అయి వచ్చిన స్టెంట్లకూ లేటెస్ట్ రేట్లే వర్తిస్తాయి.
* ఎన్పీపీఏ తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కొక్క స్టంట్ రేటు అమాంతం 85శాతం తగ్గిపోయింది.
* ప్రతియేటా దేశవ్యాప్తంగా 16వేల కోట్ల రూపాయల స్టంట్ల వ్యాపారం సాగుతోంది. తయారీ పూర్తయిన ఓ స్టంట్ వినియోగదారుడికి చేరేలోపు 600-1200 శాతం ధర పెరుగుతోంది.
* ఆసుపత్రులు రోగికి స్టెంట్‌ను అమర్చినప్పుడు దాని ఖరీదు ఎంతో ఇక నుంచి తప్పనిసరిగా తెలపాలి.

ప్రభుత్వం తీసుకున్న ఈ లేటెస్ట్ నిర్ణయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి.. లేకపోతే స్టెంట్ల కొనుగోలులో భారీగా మోసపోయే ప్రమాదం ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top