ఆత్మహత్య చేసుకునేందుకు కొన్ని రోజుల ముందు అల్లరి నరేష్ వద్దకు ఉదయ్ కిరణ్ వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఒక పేపర్‌లో వచ్చిన ఆర్టికల్‌ను అల్లరి నరేష్‌కు చూపించి కంట తడి పెట్టుకున్నాడట. ఆ ఆర్టికల్‌లో ఒక యువ హీరో గురించి రాశారు. ఆ యువ హీరో కథలు సరిగా ఎంచుకోవడం లేదు, కథల ఎంపికలో జాగ్రత్త పడక పోతే ఆ యువ హీరోకు కూడా ఉదయ్ కిరణ్‌కు పట్టిన గతే పడుతుందని కాస్త ఘాటుగా ఆ కథనంలో రాయడం జరిగిందట.
దాంతో సున్నిత మనస్కుడు అయిన ఉదయ్ కిరణ్ తీవ్రంగా నొచ్చుకున్నాడు. తన కెరీర్ ఇలా అయ్యిందే, అంతా తనను విమర్శలు చేస్తున్నారే అంటూ బాధపడ్డాడు. ఆ బాధతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్‌ది ఆత్మహత్యే అయినా కూడా ఆ మీడియా సంస్థ ఉదయ్ కిరణ్ మరణంకు కారణం అని ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.

