ఊహించని రెంజ్ లో పవన్ రెమ్యునరేషన్.. ఎంతంటే..?


టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఆయిన సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయిన ఆయిన క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో కారు.. ట్రెండ్ సెట్ జేస్తారు. ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు. పవర్ స్టార్ స్టయిలే అంత. ఇప్పటికే చాలాసార్లు ట్రెండ్ సెట్ చేసిన పవన్ కాటమరాయుడు సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా, కొన్ని థియేటర్ ఏరియా హక్కులను తీసుకొని ట్రెండ్ సెట్ జేశారు.

CLICKHERE : యోదా సిస్టర్స్ తండ్రి ఎవరో తెలిస్తే షాకే


పైగా ఇది అత్యధికంగా రేటు పలికిన ఏరియాలు కావడంతో ప్రస్తుతం ఈ వార్త సినీ జనాల్లో హాట్ టాపిక్ అయింది. డాలీ డైరెక్షన్ లో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఉగాది కానుకగా మర్చి 24 ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికీ ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్లు చేసింది. పవన్ గత సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్ అయినా కూడా ఈ కాటమరాయుడు పవర్ కొంచెం కూడా తగ్గలేదు. 


CLICKHERE : బీర్ త్రాగడం వల్ల శరీరంలో జరిగే కొన్ని భయంకరమైన మార్పులు

నైజాం థియేటర్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడుపోగా, ఓవర్సీస్ రైట్స్ 8.5 కోట్లు పలికాయి. ఈ రెండు కలిపితే 33 కోట్లు. ఈ మొత్తం రెమ్యునరేషన్ కింద పవర్ స్టార్ తీసుకోవడం సంచలనం అయింది. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఇన్నికోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ఎవరూ లేరు. ఆ రికార్డు కూడా పవర్ స్టార్ సొంతం చేసుకున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top