బాహుబ‌లి అవ్వ‌డానికి ప్ర‌భాస్ ఏం చేశాడో తెలుసా?


బాహుబ‌లి.. తెలుగు సినిమా స‌త్తాను ప్రపంచానికి తెలియజేసిన సినిమా. ప్ర‌పంచ సినిమా ప్రేక్ష‌కుల‌ను భార‌తీయ సినిమా గురించి చాటి చెప్పిన సినిమా. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న టైమ్‌లో, కెరీర్‌లో పీక్స్‌లో ఉన్న టైమ్‌లో దాదాపు ఐదేళ్లు ఈ సినిమా కోసం కేటాయించాడు. దాంతో పాటు బాహుబ‌లిలా క‌నిపించ‌డానికి ఒక బాడీబిల్డ‌ర్‌లా క‌ష్ట‌ప‌డ్డాడు.

CLICKHERE : బిర్యాని తినేటప్పుడు కూల్‌ డ్రింక్స్ తాగుతున్నారా..??

 బాహుబ‌లి రోల్‌కు సెట్ అవ్వాలి అనుకుంటే బ‌లంగా, ధృడంగా 100 కేజీల‌కు పైగా ఉండేలా క‌నిపించాలి. ప్ర‌భాస్‌ను బాహుబ‌లిగా త‌యారు చేయ‌డానికి మిస్ట‌ర్ వ‌ర‌ల్డ్ ల‌క్ష్మ‌ణ్ ప్ర‌త్యేక ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సినిమా వ‌ర‌కు బాహుబ‌లి ఫ్రేమ్ వచ్చేలా డైట్ నుంచి ఎక్స‌ర్‌సైజ్ వ‌ర‌కు ఒక ప్లాన్ వేశారు లక్ష్మ‌ణ్‌.

CLICKHERE : అబార్షన్ గురించి ఖచ్చితంగా ... తెలుసుకోవలసిన విషయాలు

బాహుబ‌లిగా త‌యార‌వ‌డానికి ప్ర‌భాస్ బాగా క‌ష్ట‌ప‌డ్డాడ‌ట‌. అర్థ‌రాత్రి కూడా వ‌ర్క‌వుట్స్ చేసేవాడ‌ట‌. ఈ సినిమా రూ. కోటి ఖ‌ర్చు చేసి జిమ్ ఏర్పాటు చేసుకున్నాడ‌ట‌. రోజుకు 8 సార్లు భో్జ‌నం చేసేవాడ‌ట ప్ర‌భాస్‌. ప్ర‌తీ రోజు 40 హాఫ్ బాయిల్డ్ ఎగ్స్‌, అర‌కిలో చికెన్‌, బాదాం, ఇత‌ర డ్రైఫ్రూట్స్ తీసుకునేవాడ‌ట‌. బిర్యానీ , జంక్ ఫుడ్ ప్ర‌భాస్‌కు ఇష్టం. ప్ర‌భాస్‌కు బిర్యానీ తినేందుకు ల‌క్ష్మ ణ్ అడ్డు చెప్ప‌లేదు. కానీ జంక్‌ఫుడ్ మాత్రం తిన‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డార‌ట‌. కఠిన‌మైన ఫైట్‌ సీన్స్ చేసిన త‌ర్వాత కూడా పెద్ద పెద్ద బ‌రువులు మోసి బాగా క‌ష్ట‌ప‌డ్డార‌ని చెబుతున్నారు ల‌క్ష్మ‌న్ రెడ్డి. ఇంత క‌ష్ట‌ప‌డ్డాడు కాబ‌ట్టి ప్ర‌భాస్ బాహుబ‌లిగా అంద‌రిని ఆక‌ట్టుకోగ‌లిగాడు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top