తన వ్యక్తిగత జీవితం పట్ల రమా రాజమౌళి షాకింగ్ కామెంట్స్

రమా రాజమౌళి ఓ ప్రముఖ ఛానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2001లో తనకు రాజమౌళితో పెళ్లైందని, అప్పటికే తనకు కార్తీక్ అనే కుమారుడున్నాడని చెప్పింది. తాను విడాకులు తీసుకున్న మహిళగా బాహుబలి మేకర్ రాజమౌళి భార్యను అయ్యానని చెప్పింది. అంతేగాకుండా.. తన బాబును ఎప్పటినీ కించపరచకుండా రాజమౌళి తన బిడ్డగానే చూసుకుంటున్నాడని తెలిపింది. 


సెల్ ఫోన్లను మరిచిపోవడం, కారు తాళాలు మరిచిపోవడం.. సెల్ ఫోన్ అంటూ టీవీ రిమోట్లను జేబులో వేసుకోవడం వంటి మతిమరుపు రాజమౌళికి ఎక్కువని రమా రాజమౌళి చెప్పింది. బాహుబలి సినిమా రాజమౌళిని పరధ్యానంలో మునిగిపోయేలా చేసిందన్నారు. ఇంకా చెక్‌లపై సరిగ్గా సంతకం చేయడం కూడా రాజమౌళికి రాదని.. ఆటోగ్రాఫ్‌లా చేసే సంతకాలు.. బ్యాంకు ఉద్యోగులకు దిమ్మదిరిగేలా చేసేవని.. ఇలా ఎన్నో చెక్కులు పనికి రాకుండా పోయాయన్నారు. ఫ్యామిలీలో ఏ వస్తువు కనిపించకపోయినా అది రాజమౌళి జేబులో కనిపించేందని రమా తెలిపింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top