కొత్త జంటకు శ్రీవారి ఆశీసులు కావాలంటే ఇలా చేయాలి!!

మాంగల్యధారణ అంటే… నా జీవనానికి కారణమైన ఈ సూత్రాన్ని నీ మెడలో నేను కడుతున్నాను. నీవు నిండు నూరేళ్లు జీవించు అని అర్థం. హైందవ సనాతన ధర్మంలో వివాహ బంధానికి ఓ ప్రత్యేకస్థానం ఉంది. వధూవరులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి విశిష్టమైన ఈ కార్యక్రమానికి లోకరక్షకుడైన ఆ శ్రీనివాసుని ఆశీస్సులు పొందితే అంతకన్నా భాగ్యం ఏముంటుంది. ఈ మహత్తర అవకాశాన్ని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. 

ఇందుకు చేయాల్సింది ఒక్కటే. పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపితే చాలు. మానవ సమాజంలో గృహస్థ ధర్మం ఎంతో కీలకమైంది. కల్యాణంలో మొదటి ఘట్టంగా వధూవరులకు కంకణాన్ని చేతికి ధారణ చేస్తారు. విపత్కర పరిస్థితుల నుంచి కాపాడే రక్షాబంధనమైన కంకణాన్ని వరుడి కుడిచేతికి, వధువుకు ఎడమచేతికి కడతారు. దీని కోసం శ్రీపద్మావతి ఆశీస్సులతో శుభాలు కోరుతూ కుంకుమతోపాటు కంకణాన్ని పంపుతారు. ఇక..

వివాహం సమయంలో చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉంది. కొత్త దంపతులకు సకల శుభాలు కలిగి సత్కర్మలు పెంపొందించాలని, దాంపత్యం ఫలప్రదం కావాలని, భార్యాభర్తలు పరస్పరం ప్రీతిపాత్రులై సిరి సంపదలతో తులతూగాలని కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తితిదే తలంబ్రాలు పంపుతోంది. తిరుమలలోని తితిదే పరిపాలనా (తపాలా విభాగం) విభాగం సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ఏటా వేలకుపైగా కొత్త జంటలకు శ్రీవారి ఆశీస్సులు అందిస్తున్నారు. శ్రీవారి ఆశీస్సులు పొందాలనుకునే నూతన వధూవరులు కార్యనిర్వహణాధికారి, తితిదే పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు. తిరుపతి – 517501 చిరునామాకు వివాహ పత్రికను పంపాలి. మరిన్ని వివరాలకు 0877-2233333, 2277777 నెంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top