మహానటి సావిత్రి గురించి షాకింగ్ విషయాలు చెప్పిన....సావిత్రి కూతురు

అలనాటి అందాల మహా నటి సావిత్రి. అందంతో పాటు అభినయంతోనూ తెలుగు సినీ ప్రపంచాన్ని ఆరోజుల్లో సావిత్రి అలరించారనడంలో సందేహంలేదు. అందుకే ఆమె తెలుగు సినీ ప్రపంచానికి మహానటి అయింది. ఇప్పుడు ఆమె జీవితకథ తెరపై రాబోతుంది. సావిత్రి గురించి ఇప్పటి ప్రేక్షకుడికి తెలియని విషయాలెన్నో. వాటినే ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు సావిత్రి బయోపిక్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. తాజాగా సావిత్రి జీవితం విశేషాల గురించి ఆమె కూతురు విజయ చాముండేశ్వరి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తండ్రి జెమినీ గణేశన్‌తో సావిత్రికి వచ్చిన విభేదాల గురించి చెప్పారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

‘‘నాకు 16 ఏళ్ల వయసులో పెళ్లైంది. నా పెళ్లికి రెండేళ్ల ముందే అమ్మ(సావిత్రి)..నాన్న(తండ్రి జెమినీ గణేశన్‌) ల మధ్య విభేదాలు తలెత్తాయి. వారి మధ్య ఏం జరుగుతోందో.. ఏం గొడవలు వస్తున్నాయో ఆ వయసులో నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. అమ్మ..నాన్నలిద్దరూ నాతో ఎప్పుడూ టచ్‌లోనే ఉండేవారు. మా నాన్న ఇంట్లో ఉండకపోయినా.. ఎప్పుడూ ఆయన ఇంటికి నేను వెళుతుండేదాన్ని. ఆ తర్వాతే అసలేం జరుగుతోందో తెలిసేది. వారిద్దరి గొడవల వల్ల ఎక్కువ ఇబ్బంది పడింది మాత్రం చాలా చిన్నవాడైన నా తమ్ముడు. అయితే.. అతడు పెరిగి..పెద్దయ్యే నాటికి ఆ గొడవలన్నీ సద్దుమణిగాయి. ఇక, అమ్మ విషయానికొస్తే.. ఆమె చాలా అమాయకురాలు. తనకొచ్చే ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవాలో కూడా ఆమెకు తెలియదు. 


ఆ తెలివి కూడా ఆమెకు లేదు. ఆమె అమాయకత్వమే ఆమె జీవితంలో చాలా చెడు చేసింది. ఇక, సరియైన సలహాలు కూడా ఆమెకు ఎవ్వరూ ఇవ్వలేదు. ఆ గైడెన్స్ లేక, సమస్యలను ఎదుర్కొనే తెలివి లేక.. మా అమ్మ మద్యానికి బానిసైంది. ఆ తర్వాత దాదాపు 19 నెలలు అమ్మ కోమాలోకి వెళ్లిపోయింది. అమ్మ తప్పకుండా బతుకుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ, మా ఆశలపై నీళ్లుజల్లుతూ ఆమె కన్నుమూసింది. ఆ 19 నెలలు అమ్మను ఆస్పత్రి బెడ్‌పై చూడడం నరకంలా అనిపించింది. ఇక, అమ్మ చివరి రోజుల్లో అమ్మ వెంటే నాన్న ఉన్నారు. ఆ టైంలో నాన్న అనుభవించిన బాధ కూడా అంతా..ఇంతా కాదు. ఇద్దరి మధ్యా ఎన్ని విభేదాలొచ్చినా.. ఆ పరిస్థితుల్లో అమ్మను చూసి చాలా చలించిపోయారాయన.

 ఆమె చనిపోయాక కూడా మేము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదు. అమ్మ ఎంత పోగొట్టుకున్నా.. అంతకన్నా ఎక్కువే సంపాదించింది. మా ఆర్థిక స్థితిగతులపై జనం అనుకుంటున్న దానికి భిన్నంగా.. అమ్మ సంపాదనతోనే మేం ఇంకా చాలా జీవితం గడిపేయొచ్చు. అమ్మ చనిపోయాక కూడా ఈ స్థితిలో ఉన్నామంటే అంతా అమ్మ చలవే’’ అని విజయ చాముండేశ్వరి చెప్పారు.

కాగా, సావిత్రి బయోపిక్‌పైనా ఆమె స్పందించారు. అమ్మ బయోపిక్ అనగానే వచ్చే తరానికి తండ్రి సావిత్రి గురించి తెలిసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో చాలా సంతోషపడ్డానని చెప్పారు. అయితే.. కొంచెం అయోమయంలో పడ్డానని, కేవలం రెండు షరతుల మీదే నాగ్ అశ్విన్‌కు మహానటి బయోపిక్‌కు ఓకే చెప్పానని అన్నారు. తొలుత తాను స్క్రిప్ట్ చదివాకే సినిమా సెట్స్ మీదకు వెళ్లాలని, సావిత్రి ఎదిగిన విధానం, ఆమెకు వచ్చిన స్టార్‌డమ్‌నే ప్రధానంగా హైలైట్ చేయాలన్న రెండు కండిషన్లను పెట్టానని విజయ చాముండేశ్వరి వెల్లడించారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top