వాట్సప్ లో మరో కొత్త ఫీచర్

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. మరో కొత్తఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ఇప్పటికే లైవ్‌ లొకేషన్‌, ఛేంజ్‌ నంబర్‌ తదితర ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్‌లో త్వరలో ‘ఫేవరెట్‌ చాట్‌’ ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా మనకు ఇష్టమైన వ్యక్తిగత లేదా గ్రూప్‌ చాట్‌ను పిన్‌ చేయడంతో దాన్ని టాప్‌లో ఉంచుకునే అవకాశం కలగనుంది. ప్రస్తుతం ఈ ఫేవరెట్ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.17.162, 2.17.163 లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే మూడు సంభాషణలను మాత్రమే యూజర్లు టాప్ లో పిన్ చేసుకోవచ్చు.

టాప్ లో పిన్ చేసుకోవాలనుకున్న చాట్ కోసం.. వాట్సాప్ బీట్ యూజర్లు, అప్లికేషన్ ను ఓపెన్ చేసి, పిన్ చేయాలనుకున్న చాట్ ను హోల్డ్ చేసి పట్టుకోవాలి. హోల్డ్ చేసిన చాట్ కు పైన కుడివైపు డిలీట్, మ్యూట్, ఆర్చివ్ ఆప్షన్ల పక్కన ఇక నుంచి టాప్ లో పిన్ ఐకాన్ కూడా కనిపించనుంది. పిన్ ఐకాన్ క్లిక్ చేస్తే చాట్ టాప్ లో పిన్ అవుతోంది. ఒకవేళ అన్ పిన్ చేయాలనుకున్నా ఇదే ప్రక్రియను యూజర్లు చేపట్టవచ్చు. అయితే ప్రస్తుతం ఈ యాప్ వాట్సాప్ బీటా వెర్షన్ లకు మాత్రమే అందుబాటులో ఉందని.. ఆండ్రాయిడ్‌ వర్షన్‌ కోసం ప్రయోగదశలో ఉన్న ఈ ఫీచర్‌.. త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top