కాస్త పెరుగులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి కాళ్లు, పాదాలు మరియు వేళ్లకు బాగా పట్టించి 10 నిమిషాల తరువాత వేడినీళ్లతో శుభ్రపరచినచో పాదాలు చాలా మృదువుగా ఉంటాయి.
బ్యూటీపార్లర్ డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌లలో లభించే కాస్మెటిక్స్ వాష్ తీసుకుని, ఆవ నూనెను వేడిచేసి అందులో కాస్త మిరియాలు వేసి బాగా వేయించిన తరువాత అందులో ఈ వాష్‌ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు పాదములకు పట్టించినచో పాదములు పట్టులా మెరిసిపోవును.
అలాగే పాదాల్లో దురదతో బాధపడేవారు.. పెద్ద ఉల్లిపాయను తీసుకొని బాగా నూరి రసం తీసి పాదములకు పట్టించి 5 నిమిషాలు మర్దనా చేసినచో దురద మటుమాయమవుతుంది.
శుభ్రమైన దీపపు నూనెలో పసుపు కలిపి పేస్టులాగా తయారు చేసుకుని, ఆ పేస్ట్‌ను రాత్రి పూట నిద్రపోవుటకు మునుపు పగుళ్ళు వున్నచోట పట్టించినచో పగుళ్ళు తగ్గి పాదాలు మృదువుగా మారుతాయి.
అలాగే ప్రతిరోజు స్నానము చేసిన తరువాత కొబ్బరి నూనెని పాదములకు పట్టించినచో, పాదాలు మృదువుగా ఉంటాయి.