Depression:టినేజ్ ని దెబ్బతీసే డిప్రేషన్...ఏమి చేయాలో తెలుసా ?

డిప్రేషన్ అనేది మానవుని జీవితంలో ఒక భాగం అయినది. దీనికి చిన్న,పెద్ద అన్న తేడా ఉండదు. పెద్దవారిలో కన్నా చిన్న వారిలోనే డిప్రేషన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పెద్దలు డిప్రేషన్ బారిన పడితే తొందరగా బయట పడటానికి వీలు ఉంటుంది. అదే టీనేజర్స్ డిప్రేషన్ నుంచి బయట పడటానికి చాలా సమయం పడుతుంది. 

ఈ సమయంలో కొందరికి చనిపోవాలనే కోరిక బలంగా కలిగి ఆత్మహత్యకు ప్రేరేపించే ప్రమాదం కూడా ఉంది. అందుకే టీనేజర్స్ లో డిప్రేషన్ లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన చర్యలు చేపట్టాలి. మీ పిల్లలలో డిప్రేషన్ లక్షణాలు కనిపించగానే క్రింద ఉన్న సూచనలను పాటించండి.

మీ పిల్లలు డిప్రేషన్ కు గురి అవుతున్నారని గుర్తించిన వెంటనే వారితో సామరస్యంగా మాట్లాడి దేని గురించి బాధ పడుతున్నారో కనుక్కోండి. ఏదో ఒకసారి మొక్కుబడిగా అడిగి వదిలివేయకుండా,వారిని విసిగించకుండా వారి నుంచి సరైన సమాదానమును రాబట్టాలి.

పిల్లలు ఏమి చెప్పినా వెంటనే తిట్టటం, కోప్పడటం చాలా మందికి అలవాటు. ఈ అలవాటు ఉన్న పెద్దలు వెంటనే ఈ పద్దతిని మార్చుకోవాలి. పిల్లలే కదా అని వారు చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా,ప్రశాంతంగా పూర్తిగా వినండి.

డిప్రేషన్ లో ఉన్న పిల్లలు ఏమి చెప్పినా వెంటనే వ్యతిరేకించకుండా,వారి ఆలోచన విధానం సరి అయినది కాదని మాటల ద్వారా,ప్రవర్తన ద్వారా సూచించండి.

చదువుకొనే చోట సమస్య ఉంటే,స్కూల్ లేదా కాలేజ్ లో లెక్చరల్ తో మీ పిల్లల విషయం చెప్పి వారి సహాయం తీసుకోండి.

డిప్రేషన్ కు లోనైనా టీనేజర్స్ చాలా త్వరగా మత్తు మందులకు అలవాటు పడే ప్రమాదం ఉంది. అందువలన వారి ప్రవర్తన మీద ఒక కన్నేసి ఉంచండి. వారిని మీరు గమనిస్తూ ఉన్నట్లు వారికీ తెలియనివ్వకండి.

డిప్రేషన్ కు లోనైనా వారిలో కనిపించే మొట్టమొదటి లక్షణం ఆహారం సరిగా తీసుకోకపోవటం. మూడ్ బాగా లేకనో,ఆరోగ్యం బాగా లేకనో,చేసిన పదార్దాలు నచ్చకనో ఆ రోజు ఆహారం తీసుకోకపోతే పెద్దగా నష్టం లేదు. ఇదే పద్దతి మూడు,నాలుగు రోజులు కొనసాగితే మాత్రం సమస్య తీవ్రంగా ఉన్నట్లు పరిగణించాలి.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top