చర్మం మీద ఎండ ప్రభావం పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. అయితే చాలా మంది దీనిని వాడే విషయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు.
ఈ పొరపాట్ల వలన చాలా సమస్యలు వస్తాయి. సాదారణంగా చాలా మంది సన్ స్క్రీన్ ని ఏదో రాసాం అన్నట్టు రాస్తారు. ఈ విధంగా రాయటం వలన ఉపయోగం ఉండదు. కొంచెం ఎక్కువగా రాస్తేనే ప్రయోజనం ఉంటుంది.
కేవలం ముఖానికే కాకుండా మెడ,పాదాలు, చేతులకు మందంగా రాసుకున్నాక మాత్రమే బయటకు వెళ్ళాలి.
రోజుకి ఒకసారి రాసుకుంటే సరిపోదు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మూడు గంటలకు ఒకసారి తప్పనిసరిగా రాయాలి. రెండు రకాల NPF ఉన్న వాటిని కలిపి రాస్తే ఎక్కువ పలితం ఉంటుందని భావిస్తారు. కానీ ఆ భావన తప్పు. ఎటువంటి సన్ స్క్ర్రీన్ రాసిన పలితం మాత్రం ఒకేలా ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే చర్మానికి రక్షణ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలను పాటించండి.