‘డి’ లోపాన్ని గుర్తిస్తున్నారా?

మనకు సహజంగా అందే వాటిల్లో విటమిన్ ‘డి’ ఒకటి. అది లోపించినప్పుడు రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఎప్పటికప్పుడు ఆ సమస్యలను గుర్తించాలి. విటమిన్ ‘డి’ లోపించినప్పుడు కండరాలు, కీళ్ళ నొప్పులు విపరీతంగా భాదిస్తాయి. ఈ సమస్య దీర్ఘకాలంగా భాదిస్తే విటమిన్ ‘డి’ లోపం ఉందేమో అని గమనించాలి. విటమిన్ ‘డి’ లోపించినప్పుడు శరీరానికి క్యాల్షియం సరిగ్గా అందక ఒంటి నొప్పులు భాదిస్తాయి. కొంత మందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అలసట,ఒత్తిడి,భాదిస్తూ ఉంటాయి. 

దీనికి కూడా విటమిన్ ‘డి’ లోపం కావచ్చు. ప్రతి రోజు ఒక అరగంట సూర్యోదయం,సూర్యాస్తమయం ఎండలో గడపటానికి ప్లాన్ చేసుకోవాలి. విటమిన్ ‘డి’ శరీరానికి శక్తిని ఇచ్చి ఉత్సాహంగా ఉంచుతుంది. విటమిన్ ‘డి’ లోపానికి ఇంకో సంకేతం కూడా ఉంది. 

వాతావరణం చల్లగా ఉన్నా తలలో చెమట పట్టటం,దురదగా,చిరాగ్గా అనిపించటం జరుగుతుంది. ఇది విటమిన్ ‘డి’ లోపాన్ని సూచించే సంకేతం. ఈ సమస్యలను గుర్తిస్తే ప్రతి రోజు పాలు,దానిమ్మ,నారింజ,చేపలు,బాదం,ఆకుకూరలు ఆహారంలో బాగంగా చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top