తల్లి గర్భంలో నించే డిప్రెషన్ మొదలు అవుతుందా?

చాలా మందిలో తరచూ కనిపించే డిప్రెషన్ అప్పటికప్పుడు వచ్చింది కాదని అది తల్లి గర్భంలోనే ప్రారంభం అవుతుందని పరిశోదకులు అంటున్నారు. గర్భవతి తరచూ డిప్రెషన్కి  గురి అవుతూ ఉంటే ఆ ప్రభావం గర్భస్థ శిశువు యొక్క మెదడు యొక్క పనితీరు మీద పడుతుందనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ప్రభావం ఆ శిశువు పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఉంటుందని,అలాగే ఆ శిశువు పెద్దయిన తర్వాత కూడా తరచూ డిప్రెషన్ కి గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. 

గర్భవతి డిప్రెషన్ కి గురి అయితే ఆ ప్రభావాలు వారి పిల్లలపై ఉంటాయని వారి పరిశోదనలో తేలింది. వీరు ఈ పరిశోదనలో బాగంగా బ్రిటన్ లో వంద మంది కుటుంబాల మహిళలు,పిల్లల ప్రవర్తన మీద పరిశోదన చేసారు. గర్భవతి తీవ్రమైన డిప్రెషన్ కి గురి అయితే ఆమెకు పుట్టిన శిశువు పెద్దయ్యాకా అదే స్థితిని పొందే అవకాశం మూడు రెట్లు అధికంగా ఉందని అంటున్నారు. 

దీనికి కారణం ఒత్తిడి హర్మోస్ ఎక్కువ స్థాయిలో విడుదల అయ్యి వాటి ప్రభావం గర్భస్థ శిశువు మీద పడుతుందని అంటున్నారు. గర్భవతి ఏ మాత్రం డిప్రెషన్ కి గురి అయిన వెంటనే వైద్యుడిని సంప్రదించి ఆ స్థితి నుండి తొందరగా బయట పడాలని పరిశోదకులు అంటున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top