చలో సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం సినిమా చేసింది ఆ సినిమా కూడా హిట్ కావడంతో తిరిగి చూసుకోకుండా వరుస అవకాశాలు క్యు కట్టాయి. ప్రస్తుతం తన మాతృభాష కన్నడంలోనూ సినిమాలు చేస్తూ మరోపక్క తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో జోడి కడుతుంది. తెలుగు తమిళం రెండు భాషల్లో విడుదలైన కార్తి సుల్తాన్ మంచి టాక్ తో దూసుకు వెళుతోంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. హిందీలో లో సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి మిషన్ మజ్ను సినిమాలో నటిస్తుంది. ఇక మెగాస్టార్ సినిమా లో ఛాన్స్ వచ్చేసింది బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది