సహజసిద్దమైన పళ్ళ రసాలు త్రాగితే ఏమవుతుంది?

తాజా పళ్ళు,తాజా కూరగాయల రసంలో విటమిన్స్,ఖనిజ లవణాలు ఎంజైమ్స్,నేచురల్ షుగర్ వంటివి ఎన్నో ఉంటాయి. ఈ రసాలను ఒక పద్దతి ప్రకారం త్రాగితే ఆరోగ్యానికి మంచిది. వీటిలో ఎన్నో పోషక విలువలు,రోగనిరోదక శక్తి ఉంటాయి. ప్రతి రోజు ఉదయం తీసుకొనే ఒక గ్లాస్ జ్యూస్ అవసరమైన న్యుట్రిన్స్ ని అందిస్తుంది. ఈ జ్యూస్ పిల్లలకు,గర్భిణిలకు చాలా మంచిది. తాజా పళ్ళు,తాజా కూరగాయల రసాలతో శరీరంలో ఇంటర్ ఫెరాన్,యాంటి బాడిస్ పెరగటంతో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. 

ఇందులో లభించే సహజ సిద్దమైన షుగర్ గుండెకు బలాన్ని ఇస్తుంది. అయితే ఈ జ్యూస్ లు తీసుకొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకే సారి ఎక్కువగా త్రాగకుండా కొద్ది కొద్దిగా త్రాగాలి. ముందుగా 100 ml త్రాగాలి. ప్రతి రోజు 50 ml పెంచుకుంటూ పోతూ రోజుకి 400 ml వరకు జ్యూస్ త్రాగవచ్చు. జ్యూస్
కోసం తాజా పండ్లను మాత్రమే ఉపయోగించాలి. జ్యూస్ తీసిన గంట లోపే త్రాగటం మంచిది. 

పళ్ళు,కూరగాయల రసాలని మిక్స్ చేసి త్రాగాకూడదు. ఈవిధంగా చేస్తే గ్యాస్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ పండ్ల రసాలను భోజనానికి ప్రత్యామ్నయంగా తీసుకోకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top