డయబెటిస్ శరీర అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో...?

Diabetes can cause damage body organs In Telugu


Diabetes can cause damage body organs In Telugu : మధుమేహ వ్యాధి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించి ఎప్పుడు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. మధుమేహం నియంత్రణ కోల్పోతే కళ్ళు,కిడ్నీలు,నరాల వ్యవ్యస్థ, రక్త సరఫరా, కొలస్ట్రాల్ పెరగటం,రక్త నాళాల బ్లాక్ అవ్వటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి.

మధుమేహం నియంత్రణలో లేకపోతె ముందుగా ఆ ప్రభావం కంటి మీద పడుతుంది. ఇంకా అశ్రద్ధ చేస్తే కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంది. ప్రతి ఆరునెలలకు ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి.

ఇక ఆ తర్వాత ఎక్కువగా పాదాల మీద ప్రభావం పడుతుంది. మధుమేహం నియంత్రణలో లేకపోతే పాదాలకు గాయాలు అయినా వారికి తెలియదు. అలాగే గాయాలు మానటానికి చాలా సమయం పడుతుంది. డయాబెటీస్ వున్నవారికి గాయాలైతే, ఇన్ ఫెక్షన్ చాలా త్వరగా శరీర భాగాలలో వ్యాపిస్తుంది. పాదాలకు వీరు సరి అయిన పాదరక్షలు ప్రత్యేకించి బూట్ల వంటివి వాడి గాయాలు అవకుండా చూసుకోవాలి.

మధుమేహం ఉన్నవారిలో కిడ్నీలు డేమేజ్ అయినా వెంటనే గుర్తించలేరు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షా చేయించుకుంటే చాలా మంచిది. కాబట్టి రెగ్యులర్ గా అన్ని టెస్ట్ లు చేయించుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. ఒకవేళ సమస్య ఉన్న వెంటనే తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. అందువలన మధుమేహము ఉన్నవారు రెగ్యులర్ గా రక్త పరీక్షలు చేయించుకొని దానికి అనుగుణంగా మందులు వాడి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top