రోజు సగ్గుబియ్యం తింటే ఏమి అవుతుందో తెలుసా ?

saggubiyyam benefits


Saggubiyyam Health Benefits In Telugu :సగ్గుబియ్యంను కర్ర పెండలం నుంచి తీసుకున్న పొడితో తయారుచేస్తారు.సాధారణంగా మనం సగ్గుబియ్యంతో ఉప్మా,పాయసం వంటివి చేస్తూ ఉంటాం. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.అందువల్ల బరువు తగ్గాలని అనుకొనే వారికి ఒక మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. సగ్గుబియ్యానికి వ్యాధులను నయం చేసే శక్తి మరియు తక్షణ శక్తి ఇచ్చే లక్షణాలు ఉండుట వలన ఆరోగ్యానికి చాలా మంచిది.

సగ్గుబియ్యంతో ప్రోటీన్ సమృద్ధిగా ఉండుట వలన కండరాల పెరుగుదలకు,కండరాల బలానికి బాగా సహాయపడుతుంది. క్యాల్షియం సమృద్ధిగా ఉండుట ఎముకలు పెళుసుగా మారకుండా బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే సగ్గుబియ్యంలో ఉండే పొటాషియంరక్త ప్రసరణ బాగా జరిగేలా చూసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అంతేకాక రక్తంలో కొలస్ట్రాల్ ని కూడా నియంత్రిస్తుంది. దాంతో గుండెకు సంబందించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.

సగ్గుబియ్యాన్ని ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే రోజంతా ఎనర్జీగా ఉంటారు. జీర్ణక్రియను మెరుగుపరచి గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. దీనిలో ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి సమృద్ధిగా ఉండుట వలన గర్భణి స్త్రీలు ఆహారంలో భాగంగా చేసుకుంటే గర్భంలో
బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది.
Share on Google Plus