పైసా ఖర్చు లేకుండా ఉల్లిపాయతో ఇలా చేస్తే పాదాల పగుళ్ళు మాయం

Cracked Heels Home Remedies
Cracked heels Home remedies In telugu : పాదాల పగుళ్లు అనేవి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పాదాల పగుళ్ళ సమస్య ఉన్నప్పుడు నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయటానికి తీవ్రమైన అసౌకర్యానికి గురి అవుతూ ఉంటారు. 

పాదాల పగుళ్లు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వక చాలా నిరాశకు గురి అవుతారు. అయితే పైసా ఖర్చు లేకుండా మనం వంటింట్లో వాడే ఉల్లిపాయను ఉపయోగించి పాదాల పగుళ్ళ సమస్యను తగ్గించుకోవచ్చు.
ఒక ఉల్లిపాయ తీసి శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ గా చేసి దాని నుంచి జ్యూస్ సపరేట్ చేయాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ జ్యూస్, ఒక స్పూన్ బేకింగ్ సోడా, రెండు స్పూన్ల టూత్ పేస్ట్, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్లపై రాసి అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు మాయం అయ్యి మృదువుగా కోమలంగా మారుతాయి ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top