ఇలా చేస్తే జుట్టు ఎంత పల్చగా ఉన్నా నెల రోజుల్లో ఒత్తుగా మారుతుంది

Hair Fall Home Remedies In telugua

Hair Fall Home Remedies : ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి, వాతావరణంలో కాలుష్యం, ఒత్తిడి, జుట్టుకు సరైన పోషణ లేకపోవడం వంటి ఎన్నో రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనబడుతుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. 

మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల బియ్యం వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికిన బియ్యాన్ని చల్లారపెట్టాలి. 

చల్లారిన రైస్ ను వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో రైస్ పేస్ట్, రెండు ఎగ్ వైట్స్, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. 

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు  రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top