Diabetes:షుగర్ ని శాశ్వతంగా తగ్గించే గింజలు ఇవే...షుగర్ అసలు పెరగకుండా కంట్రోల్ కి వచ్చేస్తుంది

Diabetes fenugreek remedy: ఈ మధ్య కాలంలో డయాబెటిస్ అనేది వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయస్సులోనే వస్తుంది. దాంతో చాలా కంగారు పడుతూ ఉంటారు. డయాబెటిస్ ఉన్నప్పుడు జీవిత కాలం మందులు వాడాలి.

అలా మందులను వాడుతూ డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది. మెంతులు డయాబెటీస్ (మధుమేహం)‌తో బాధపడుతున్న రోగులకు సంజీవని వంటిది అని చెప్పవచ్చు.

ప్రతి రోజు అరస్పూన్ మెంతులను నానబెట్టి...లేదంటే పొడి రూపంలో తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. మెంతుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం ఉందని పరిశోదనలో తేలింది.

మీరు తినే ఆహారంలో మెంతుల్ని రోజు ఉండేలా చూసుకోండి. లేదా రోజు పరగడుపున మెంతుల పొడిని నీటిలో కలుపుకొని, గంట పాటు నానబెట్టి వాటిని తాగితే, నెల రోజుల్లో మధుమేహం అదుపులోకి వచ్చేస్తుంది.

రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయం లేచి ఆ నీళ్లను తాగినా మంచిదే. లేదా మెంతుల పొడిని రాత్రి నీళ్లలో నానబెట్టి,ఉదయం లేచి ఆ పొడి తో సహా తాగినా ఎంతో మేలు చేస్తుంది. ఎలా చేసిన మెంతులు పొట్టలోకి వెళ్లడం ముఖ్యం. ఇలా పరగడుపున మెంతులు పొట్టలోకి వెళ్లడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top