Papaya Seeds Benefits In Telugu:బొప్పాయిలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే బొప్పాయి ఆకులలో కూడా ఎన్నో ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనం సాధారణంగా బొప్పాయి పండు తిన్నప్పుడు గింజలు తీసి పాడేస్తూ ఉంటాం
ఆ గింజలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బొప్పాయి గింజలను సరైన మోతాదులో తీసుకుంటే పొట్టలోని విషాలు అన్నీ బయటికి పోయి అంతర్గతంగా శుభ్రం అవుతుంది. కడుపులో వ్యర్ధాలు కూడా తొలగిపోయి జీర్ణాశయంలో క్రిములు లేకుండా ఉంటుంది.
ఇన్ఫెక్షన్స్ లేకుండా నివారిస్తుంది. అధిక బరువు సమస్య ఉన్న వారిలో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. పురుషులలో సంతాన లేమి సమస్యలను తగ్గిస్తుంది. కాలేయ సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే బొప్పాయి గింజలను తీసుకునే ముందు ఒక్కసారి ఆయుర్వేద వైద్య నిపుణుని సంప్రదిస్తే మంచిది
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.