Hair Growth Oil : ఈ నూనె రాస్తే.. మీ జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Hair Growth oil

Hair Growth Oil : ఈ మధ్య కాలంలో మారిన జీవన శైలి పరిస్థితులు, ఒత్తిడి, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య వస్తుంది. ఈ సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.

Oil For Hair Growth :అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ (Side Effects) వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మన ఇంటిలోనే సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Curry Leaves

పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దానిలో 100 ఎంఎల్ కొబ్బరి నూనె (Coconut Oil) పోసి కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల మెంతులు (Mentulu), రెండు రెమ్మల కరివేపాకు (Curry Leaves), ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలిపి ఐదు నుంచి పది నిమిషాల పాటు వేడి చేయాలి.

ఈ విధంగా వేడి చేయడం వలన మెంతులు, కరివేపాకులో ఉండే పోషకాలు నూనెలోకి చేరి రంగు మారుతుంది. ఇలా రంగు మారాక పొయ్యి ఆఫ్ చేసి కాస్త చల్లార్చి వడగట్టి సీసాలో నిలువ చేసుకోవాలి.ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. 

Fenugreek Hair Benefits

ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల  వరకు పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం (Head Bath) చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య(Hair Loss)  తగ్గుతుంది.

జుట్టు (Hair) కు అవసరమైన పోషకాలు అంది జుట్టు కుదుళ్ళు  బలంగా మారి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా చుండ్రు(Dandruff) సమస్యను కూడా తగ్గిస్తుంది,

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top