Dandruff:లవంగాలతో ఇలా చేస్తే 7 రోజుల్లో చుండ్రు మాయం

 

Dandruff Home Remedies in telugu :చుండ్రు సమస్య వచ్చిందంటే ఒక పట్టాన వదలదు. చుండ్రు సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడే ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా బయటపడవచ్చు. చుండ్రు  కారణంగా జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. మనలో  చాలామంది చుండ్రు సమస్య ప్రారంభం కాగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ వాడేస్తూ ఉంటారు. 

అలా వాడటం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు. లవంగాలు చుండ్రు సమస్యను తగ్గించుకోవటానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. 

పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసు నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ లవంగాల పొడి వేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ నీటిని వడగట్టి స్ప్రే బాటిల్లో పోసి జుట్టు కుదుళ్ళ   నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. 

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తొలగిపోవడమే కాకుండా జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ చిట్కాని ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Share on Google Plus