Antioxidant Fruits:యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉన్న 7 ఆహారాలు


యాంటి ఆక్సిడెంట్ అనేవి మనకు వర ప్రదాయిని అని చెప్పవచ్చు. ఇది మనకు చాలారకాలుగా సహాయపడుతుంది. వయస్సు మీద పడకుండా కాపాడటంలో కీలకమైన పాత్రను పోషించటమే కాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 

యాంటి ఆక్సిడెంట్స్ మనకు వృద్ధాప్యం దరి చేరకుండా ఆరోగ్యంగా, యౌవనంగా ఉండేలా సహాయపడుతుంది. అలాగే యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉన్న ఆహారాలు మనకు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తుందో వివరంగా తెలుసుకుందాం.

రెడ్ బీన్స్
అన్ని రకాల బీన్స్ ఆరోగ్యానికి మంచివే. కానీ ముదురు రంగు బీన్స్ అతిపెద్ద ఆరోగ్య ప్రయోజనం ఉన్న ప్యాక్ అని రుగీరో చెప్పారు. ఒక రీసెర్చ్ ప్రకారం బీన్స్ లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ గుండె వ్యాధి మరియు
క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుందని తెలిసింది.

బ్లూ బెర్రీస్
బ్లూ బెర్రీస్ లో ఆంథోసియానిన్ అనే సహజ ప్లాంట్ కెమికల్ సమృద్ధిగా ఉంటుంది. ఈ బెర్రీలకు వాటి రంగును బట్టి ఆ పేరు వచ్చింది. బ్లూ బెర్రీస్ దృష్టి సరిగ్గా ఉండేలా చేయుట,రక్తంలో చక్కర శాతం తక్కువ ఉండేలా చూడటం,మెమరీ మరియు జ్ఞానశక్తి మెరుగు పరచటం, మైండ్ షార్ప్ గా ఉంచటంలో సహాయం చేస్తుంది.

క్రాన్బెర్రీస్
ఇవి కూడా బ్లూ బెర్రీస్ వలెనే ఉంటాయి. ఈ తియ్యటి టార్ట్ బెర్రీలకు ఆ రంగు వాటిలో ఉండే ఆంథోసియానిన్ల వలన వచ్చింది. ఇది వాపు తగ్గించడానికి మరియు రోగనిరోధకతను బలోపేతం చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. అంతేకాక క్రాన్బెర్రీస్ కొన్ని రకాల గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ల మీద పోరాటం చేస్తుంది.


ఆర్టిచోక్ హార్ట్స్
పైబర్,యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉన్న ఈ విజిటేబుల్ సిద్దం చేయటం సులభం మరియు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటం మరియు గుండె వ్యాధుల మీద పోరాడే సామర్ధ్యంను కలిగి ఉంది.

బ్లాక్ బెర్రీస్
శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఈ నిగనిగలాడే చిన్న బెర్రీలు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడం మరియు చిత్తవైకల్యం నుండి మెదడును సమర్ధవంతంగా రక్షించేందుకు సహాయపడతాయి. అంతేకాక ఈ బ్లాక్ బెర్రీలు పెద్దప్రేగు క్యాన్సర్ మిద పోరాటంలో కూడా సహాయపడతాయి.

ప్రూనే
దీనిని ఎండిన రేగు అని పిలుస్తారు. దీనిలో శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి.

రాస్ప్బెర్రీస్
రాస్ప్బెర్రీస్ చూడటానికి చిన్నగా ఉన్నా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. గుండె వ్యాధి మరియు కొన్ని రకాల క్యాన్సర్ల మీద పోరాటం చేయటానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top