పసుపు రంగులో ఉండే నిమ్మకాయలో గుజ్జు,రసం,తొక్క వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. నిమ్మకాయను ఆహారంలో పుల్లని రుచి కోసం వాడతారు. నిమ్మకాయలో 5 నుంచి 6 శాతం సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మరసంలో ఉన్న ప్రత్యేకమైన రుచి కారణంగా కాక్టెయిల్, శీతల పానీయాలలో ఒక ముఖ్యమైన పదార్దంగా వాడతారు.
నిమ్మరసం కొన్ని ఆహార పదార్దాలకు సంరక్షణకారినిగా కూడా పనిచేస్తుంది. అది ఎలాగంటే...ఆపిల్, అరటి మరియు అవకాడొ వంటి పండ్లు కోసిన కొంత సేపటికి ఆక్సిడైజ్ జరిగి గోధుమ వర్ణంలోకి మారతాయి. అవి అలా గోధుమ రంగులోకి మారకుండా ఉండాలంటే ఆ ముక్కలకు నిమ్మరసం రాయాలి.
నిమ్మకాయ రసం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఉదయాన్నే నిమ్మకాయ రసం త్రాగితే పొట్ట తగ్గటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఉదయం తప్పనిసరిగా నిమ్మకాయ రసం ఎందుకు త్రాగాలో తెలుసుకుందాం.
సాదారణంగా మనం ఉదయం లేవగానే మంచి రుచి మరియు వాసన కలిగిన కాఫీ త్రాగటం జరుగుతూ ఉంటుంది. అయితే కాఫీ త్రాగటాన్ని ఒక అర గంట వాయిదా వేసి కేవలం నిమ్మరసం త్రాగితే చాలా మంచిది.

క్యాన్సర్ కణాలను చంపే గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. కానీ మనవ శరీరంలో ఆల్కలీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటేనే ఉత్తమంగా పనిచేస్తుంది. ఆమ్ల పండుగా ప్రసిద్ది చెందిన నిమ్మకాయను గొప్ప ఆల్కలీన్ ఏజెంట్ గా చెప్పవచ్చు.
నిమ్మరసం త్రాగినప్పుడు శరీరంలో ఆమ్ల స్థాయిలు తగ్గుతాయి. ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఎసిడిక్ గా ఉన్నప్పుడు మరియు చర్మం యొక్క pH స్థాయిలను తగ్గించడానికి నిమ్మకాయ నీరు సహాయపడుతుంది.
విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి నిమ్మకాయలో యాంటి ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధిలో సహాయపడుతుంది.
నిమ్మలో ఉండే విటమిన్ B శక్తి ఉత్పత్తి కోసం, రిబోఫ్లేవిన్ పెరుగుదలకు సహాయం, కాల్షియం వంటి ఖనిజాలు కణజాలం అభివృద్ధి మరియు మరమత్తు కోసం, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ ఎముకలు మరియు దంతాల బలం కొరకు సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.