ముఖం మీద అవాంఛిత జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా...ఈ ఫాక్స్ మీకోసమే

Facial Hair Removeal Packs In Telugu

Facial Hair : జుట్టు అనేది అమ్మాయిలకు అందాన్ని ఇస్తుంది. అయితే అదే జుట్టు ముఖం మీద ఉంటే అవాంఛిత రోమాలు అని అంటారు. ఈ సమస్య కారణంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యకు ఖరీదైన కాస్మొటిక్స్ ఏమి వాడవలసిన అవసరం లేదు.

కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ సమస్యను పసుపు సమర్ధవంతంగా పరిష్కారం చూపుతుంది. పసుపును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము.

ఒక స్పూన్ పసుపులో పాలు పోసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో రాసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ వెంట్రుకలు ఎక్కువగా ఉంటే శనగపిండిలో బియ్యం పిండి,పసుపు వేసి నీటిని కలిపి పేస్ట్ గా చేసి ముఖానికి రాసి 5 నిముషాలు అయ్యాక స్క్రబ్ చేయాలి.

ఒక స్పూన్ శనగపిండిలో,చిటికెడు పసుపు, పాలను పోసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బంగాళాదుంపలో సహజసిద్ధమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన అవాంఛిత రోమాలను తగ్గించటంలో చాల సమర్ధవంతంగా పనిచేస్తుంది. కందిపప్పును రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ లో బంగాళాదుంప జ్యుస్ ,నిమ్మరసం,తేనే కలిపి ముఖానికి రాసి పావుగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top