కొత్తిమీర రైస్ ,పుదీనా రైస్ అలాగే కరివేపాకు healthy కదండీ, హెయిర్ ఫాల్ కి ఇంకా మంచిగా ఉంటుంది. పిల్లలకి కాబట్టి ఇష్టంగా ఈ రకంగా చేసి పెట్టండి.
కావలసినవి:
ఒక కప్పు రైస్, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, మినప గుళ్ళు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు ,ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె.
చేసే విధానం:
రెండు కప్పుల కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరనివ్వండి. ఒక మిక్సీ జార్ లో ఈ ఆకును వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని , స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి రెండు మూడు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత రెండు స్పూన్ల వేరుశెనగ గుళ్ళు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినప గుళ్ళు ,ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్ లో బాగా వేయించుకోండి.
పోపు వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, ఎండు మిరపకాయ ముక్కలు వేసి వేయించుకోండి. పోపు వేగిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు , పావు టీ స్పూన్ ఇంగువ, కొంచెం పసుపు, వేసి వేగించుకోండి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ ని వేసుకోండి.
ఆయిల్ సపరేట్ అయ్యేవరకు, కొంచెం వాసన వస్తుంది. అప్పటి వరకు ఉంచి stove off చేయాలి. రుచికి సరిపడా ఉప్పు, ఒక నిమ్మకాయ రసం తీసి పోపులో కలుపుకోండి. ఒక కప్పు రైస్ రెండు కప్పుల వాటర్ వేసి అన్నం వండుకోండి .
చల్లారిన తర్వాత రైస్ ని కరివేపాకు పేస్ట్ లో వేసి కలుపుకోండి .చేతితో బాగా కలుపుకుంటే flavours రైస్ కి బాగా పడతాయి. ఇది ఒక్కొక్కసారి రైస్ మిగిలినప్పుడు కూడా చేసుకోవచ్చు. పిల్లలు కరివేపాకు ఉన్న ఏరి పక్కన పడేస్తారు కదా ఇలాంటి రైస్ చేయడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. ముఖ్యంగా health కి మంచి రెసిపీ.