Meal Maker pulao:త్వరగా ఇంకా టేస్టీగా లంచ్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ రెసిపి ట్రైచెయ్యండి

మనకి అందుబాటులో అన్ని వెజిటేబుల్స్, పన్నీరు ఇవన్నీ ఉండాలని పెట్టుకోకుండా ఒక డిఫరెంట్ రైస్ రెసిపీ చూద్దాం.  సోయా కానీ మిల్ మేకర్ కానీ ఉంటే ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు.చాలా ఈజీగా అయిపోతుంది.

కావలసినవి:

ఒక కప్పు రైస్ ,ముప్పావు కప్పు సోయా  గ్రాన్యూల్స్, బిర్యానీ సరుకులు ,ఉల్లిపాయ, పచ్చిమిర్చి ,క్యారెట్ ,నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పుదీనా, ఉప్పు, కారం.

చేసే విధానం:

ఒక కప్పు బియ్యం, పావు గ్లాస్  అనుకోండి ఒకటికి రెండు నీళ్లు తీసుకొని  బాగా కడిగిన తర్వాత కుక్కర్లో పోసుకోండి. దానిలో ఒక ఇలాచి, రెండు లవంగాలు ,కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు, కొంచెం సాల్ట్, హాఫ్ టీ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ, కొంచెం తురిమిన పుదీనా వేసి మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోండి. 

కుక్కర్ విజిల్ వచ్చేలోపు ,ఒక ఆర లీటర్ నీళ్లు తీసుకొని అర స్పూను ఉప్పు వేసుకొని మరిగించుకోని, ముప్పావు కప్పు సోయా granules తీసుకొని ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం మెత్త పడుతుంది కదా, అప్పుడు  వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోండి. 

ఒక స్పూన్ తో ప్రెస్ చేస్తూ మొత్తం వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక ఇంచు దాల్చిన చెక్క , ఒక యలకులు, నాలుగు లవంగాలు, పది మిరియాలు ,కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు ,రెండు ఉల్లిపాయలు, సన్నగా పొడుగ్గా తరిగినవి.  మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీలికలు వేసి అవి కూడా వేసుకోండి. 

ఒక మీడియం సైజ్ క్యారెట్ ని కూడా చిన్న ముక్కలు చేసి దాన్ని కూడా  వేపుకోండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి ,పచ్చి వాసన పోయే వరకు వేపిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక పావు స్పూను పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ,వన్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కూడా వేసుకో సన్నగా తరిగిన పుదీనా, కొంచెం వేసి ఒక అర కప్పు పెరుగు వేసుకోండి. 

నూనె తేలే వరకు ఉడికించుకోవాలి. అది కొంచెం గ్రేవీగా వచ్చిన తర్వాత ఈ సోయా granules కూడా అందులో వేసుకోండి .కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత మీకు సరిపడా వేసుకోవచ్చు .కొంచెం ఆయిల్ సపరేట్  అవుతూ ఉండగా, ఉడికించి పెట్టుకున్న రైస్ ని కూడా దాంట్లో వేసేయండి.  

రైస్ కి గ్రేవీ బాగా కలిసేలాగా అన్నం చితక్కకుండా బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసి కలుపుకోండి .కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని ,మొత్తం రైస్ అంతా కలుపుకోండి. ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచండి. అంతేనండి సోయా కీమ బిర్యానీ రెడీ.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top