Chekka Pakodi :స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే కమ్మని చెక్క పకోడి

ఈవినింగ్ స్నాక్స్ , పిల్లలకి  బాక్స్ లో స్నాక్స్ , టీ బ్రేక్ టైం లో స్నాక్స్ కి ఈ రిబ్బన్ పకోడీ స్వీట్ షాప్ స్టైల్ పకోడీ లాగా క్రిస్పీగా, క్రంచీగా, రుచిగా ఉంటాయి. మీరు చేసి చూడండి.

కావలసినవి

బియ్యప్పిండి, పుట్నాల పప్పు, ఉప్పు, కారం ,నువ్వులు ,జీలకర్ర, నెయ్యి.

చేసే విధానం:

అర కప్పు పుట్నాల పప్పు మిక్సీ జార్ లో తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఉండాలి. దాన్ని మళ్లీ జల్లెడ కూడా వేసుకోండి. అప్పుడు బాగా ఫైన్ పౌడర్ వస్తుంది. దీంట్లో రెండు కప్పుల బియ్యపిండి వేసుకోవాలి .ఇది కూడా జల్లెడ వేసుకోండి .బరకగా ఉన్న పౌడర్ ని తీసేయండి .

ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, రెండు స్పూన్ల నువ్వులు, తెల్లవైన, నల్లవైన ,ఒక స్పూన్ నెయ్యి కాని వెన్న కానీ, అర స్పూన్ వాము పౌడర్, వాము కానీ జీలకర్ర గాని, ఏదైనా పర్లేదు. రెండు కప్పుల గోరువెచ్చని నీళ్లు పెట్టుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తం పిండి అంతటిని కలుపుకోవాలి.  

మొత్తం అంతటినీ కలిపి ఒక దగ్గరగా నొక్కి పెట్టి ఉంచేసుకొని ఒక మూత పెట్టి పది నిమిషాలు నాననివ్వాలి. ఈ లోపు మురుకులు గొట్టంలో  రిబ్బన్ పకోడీకి కావాల్సిన పళ్లెం ని తీసుకొని మురుకులు గొట్డానికి లోపల కూడా నూనెతో గ్రీస్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు గొట్టానికి సరిపడా పిండి తీసుకొని మిగిలిన వాటర్ తో ముద్ద అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి.

 ఒకేసారి మొత్తం వాటర్ ముద్ద అయ్యేలా కలపకూడదు. మరి గట్టిగా ఉండకూడదు. మరీ సాఫ్ట్ గా ఉండకూడదు. మురుకుల గొట్టంలోకి  దిగే  బెటర్ చూసుకొని కలుపుకొని ప్రిపేర్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె కాగిన తర్వాత, ఈ గొట్టం ద్వారా రిబ్బన్ పకోడీ లాగా వెడల్పుగా , ముక్కలుగా ఒత్తుకోండి. 

మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. నూనె తేరే వరకు నురుగు వచ్చే వరకు  ఉంచి కొంచెం తిప్పండి అంతే క్రిస్పీగా టేస్టీగా మంచి టెక్చర్ లో రిబ్బన్ పకోడీ రెడీ .ఇవి స్నాక్స్ గా పిల్లలకి పెట్టిన ,టీ బ్రేక్ లో బాగుంటాయి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top