Instant Chutney Powder:ఈ పొడి ఉంటే ఏ టిఫిన్స్ లోకి అయినా చిటికెలో చట్నీ రెడీ అవుతుంది

ప్రతి రోజు టిఫిన్స్ లోకి  చట్నీలతో ఒక సమస్య . ఎప్పుడు ప్రతి పూట చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి change కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. సో ఇలా ఇన్స్టంట్ గా ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకుంటే మీకు అందుబాటులో ఎలా కావాలంటే అలాగా ఉపయోగించుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్ కి ఈజీగా ఉంటుంది.

కావలసినవి: 

వేరుశనగ గుళ్ళు, పుట్నాల పప్పు, ఎండు మిరపకాయలు ,వెల్లుల్లి రేకలు, చింతపండు, జీలకర్ర  ,కొబ్బరి, ఉప్పు.

చేసే విధానం:

ఒక కప్పు వేరుశనగ గుళ్ళు low to flame పెట్టుకొని ఒక పాన్ లో నూనె లేకుండా వేపాలి. ఇవి ఒక ప్లేట్లోకి వేసి చల్లార  పెట్టుకోండి. మళ్లీ అదే కప్పుతో పుట్నాల పప్పు తీసుకొని లైట్ గా ఎగనిస్తే సరిపోతుంది. ఇవి కూడా పల్లీల మీద వేసి చల్లారనివ్వాలి .

ఒక పావు కప్పు  ఎండు కొబ్బరి ముక్కలు అక్కర్లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు,  అవి కూడా లైట్ గా వేపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్లో రెండు స్పూన్ల నూనె వేసుకొని ఒక 20 ఎండు మిరపకాయలు వేపుకోండి. వాటిని కలుపుకుంటూ మాడకుండా చూసుకొని వేగించుకోండి. 

మీకు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయాలనుకుంటే కూడా వేసుకోండి. వాటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేలా ఏపు వేయించుకోవాలి. ఒక్క స్పూను జీలకర్ర కూడా వేసి కలుపుకోండి. ఈ ఎండు మిరపకాయలు కూడా ఒక పళ్ళెంలోకి తీసుకొని pan ఒక్కసారి టిష్యూ పేపర్ తో తుడిచి మళ్ళీ ఒక కప్పు కరివేపాకు తీసుకొని వేపండి. 

ఆరబెట్టిన కరివేపాకు  కాబట్టి క్రిస్పీగా అయ్యేవరకు వేపుకొని వీటిని కూడా ఎండుమిరపకాయల మీద వేసుకోండి. అలాగే ఆ పాన్లో చిన్న నిమ్మకాయ అంత చింతపండు విడదీసి లో ఫ్లేమ్ లో వేడి తగినట్టుగా వేపుకోండి. ఈ పౌడర్ల అన్ని మిక్సీ పట్టేల్లోపు చింతపండు కూడా  పాన్ మీద ఉంచండి. క్రిస్పీగా డ్రై గా ఉంటుంది .

మనం పొడిగా చేసుకుంటున్నాం కాబట్టి డ్రై అవ్వాలి కాబట్టి అలాగా ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండు మిరపకాయలు, కరివేపాకు ,జీలకర్ర ఉన్న వాటిని వేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటూ మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు పల్లీలు, పుట్నాల పప్పుని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. 

ఇప్పుడు వేయించి పెట్టుకున్న చింతపండు, పది  వెల్లుల్లి రేకలు కూడా వేసుకోండి. అంతేనండి ఒక్క వాటర్ తప్ప అన్ని మామూలుగానే వేస్తాము ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బౌల్ లోకి తీసుకొని వాటర్ కలుపుకొని చట్నీ లాగా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోండి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top