Atukula Vada :పప్పునానబెట్టే పనిలేదు రుబ్బేపనిలేదు నిమిషాల్లో వడలు రెడీ

పప్పు నానబెట్టే పని లేకుండా  అప్పటికప్పుడు సాఫ్ట్ గా ఉండే వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం.రుచి చాలా బాగుంటుంది.  

కావలసినవి:

అటుకులు, బియ్యపిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ,అల్లం, జీలకర్ర, మిరియాలు, కావలసినంత నూనె, రుచికి సరిపడా ఉప్పు.

చేసే విధానం:

రెండు కప్పుల లావు అటుకులు తీసుకోండి. రెండు కప్పుల అటుకులకి 16 వడలు అవుతాయి. అటుకులు శుభ్రంగా కడిగి ఒక అర కప్పు నీళ్లు పోసుకుని తడిపినట్టుగా కొంచెం వాటర్ ఉండేల   20 నిమిషాల పాటు  నాననివ్వాలి. ఈ లోపు  ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర,  అన్ని సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. 

నానబెట్టిన అటుకుల్ని ఇప్పుడు ముద్ద లాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుతూ ఉండగా మొత్తం అన్ని అటుకులు కూడా smash అయినట్టుగా వస్తాయి. గట్టిగా చేతితో  ముద్దలాగా కలుపుకోండి. సరిగా కలపకపోతే నూనెలో వేసినప్పుడు అవి విరిగిపోతాయి. 

ఇలా soft గా కలిపిన తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తురుము కొత్తిమీర ,కరివేపాకు అన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, పావు కప్పు  క్రిస్పీగా ఉండడానికి బియ్యప్పిండి ని కూడా కలుపుకోండి. పావు స్పూను జీలకర్ర, అర స్పూను  మిరియాలు కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తాయి.  

అన్నీ బాగా మెత్తగా కలిపిన తర్వాత అర కప్పు పెరుగు తీసుకొని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండండి కమ్మని పెరుగు కంటే పుల్ల పెరుగు బాగుంటుంది. వాటర్ అయితే అసలు వేయకండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టుకొని అది కాగేలోపు వడలు చేసుకుందాం. 

చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు ముద్దలు నూనె తడి చేసుకొని ముద్దలు క్రాక్స్ రాకుండా చక్కగా roll and round చేసుకొని లైట్ గా ప్రెస్ చేసి అటూ ఇటూ మనం గారెలకి బెజ్జం పెట్టినట్టుగా పెట్టుకోవాలి .ఒక వాయకి సరిపడా వడల్ని చేసి , మీడియం ఫ్లేమ్ లో వేసిన తర్వాత నురగరే వరకు కదపకుండా వేగనివ్వండి. 

అవి వే గేలోపు మళ్లీ వాయికి చేసి పెట్టుకోండి. వేగిన వాటిని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి , ఆయిల్ ఉంటే అది observe చేస్తుంది . అంతేనండి ఇన్స్టెంట్ వడ రెడీ.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top