కీరదోసలో 95 శాతం నీరు ఉంటుంది. దాంతో డీహైడ్రేట్ సమస్య ఉండదు. అదే సమయంలో శరీరంలో పేరుకున్న వ్యర్దాలు కూడా పోతాయి. అయితే సాధ్యమైనంత వరకు చెక్కు తీయకుండా తినటం మంచిది. ఎందుకంటే కీరదోస చెక్కులో విటమిన్ సి ఉంటుంది. దాన్ని అలాగే తీసుకోవటం వలన ఒక రోజులో శరీరానికి అవసరమైన విటమిన్ సి 10 శాతం అందుతుంది.
నీటి శాతం ఎక్కువగా ఉండటం,కేలరీలు తక్కువగా ఉండటం వంటి కారణాలతో బరువు తగ్గాలని అనుకునే వారికీ మంచి ప్రత్యామ్నాయం. కీరదోస లో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. మలబద్దకంతో బాధ పడేవారు రోజు కీరదోసను తీసుకోవటం ద్వారా ఈ సమస్య చాలా సులువుగా అదుపులోకి వస్తుంది. అదే సమయంలో జీవక్రియ కూడా మెరుగు అవుతుంది.
కీరదోస శరీరంలోని కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కీరదోసలో మేగ్నిషియం,పొటాషియం,పీచు ఎక్కువగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఒకవేళ తక్కువగా ఉన్నా బేలన్స్ చేస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది అధిక రక్తపోటు ఉన్నవారికే కాకుండా లో బిపి ఉన్నవారికి కూడా బాగా పనిచేస్తుంది.
కీరదోసలో ఉన్న సిలికా కీళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైగా విటమిన్ ఎ,బి1,బి6,సి,డి విటమిన్స్,పోలేట్స్, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. దిన్ని క్యారట్ తో కలిపి జ్యూస్ గా చేసుకొని త్రాగితే కీళ్ళకు చాలా మంచిది.