డయాబెటిస్ వాళ్ళకి, వెయిట్ లాస్ కి జొన్న జావా చాలా బాగా హెల్ది బ్రేక్ఫాస్ట్ రెసిపీ.
కావలసినవి
ముప్పావు కప్పు జొన్న రవ్వ ,పావు కప్పు పచ్చ శనగపప్పు, ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు,ఒక ఉల్లిపాయ,పావు కప్పు క్యారెట్ ముక్కలు, పావు కప్పు పచ్చి బఠాణి, కొంచెం సాల్ట్, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి
చేసే విధానం:
ముప్పావు కప్పు జొన్న రవ్వ ,పావు కప్పు పచ్చ శనగపప్పు శుభ్రంగా కడిగి కుక్కర్ లో తీసుకోని మూడు కప్పులు నీళ్లు పోసుకోండి. ఒక గంట పాటు నానబెట్టుకొని 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. పక్కన పాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక స్పూను వెల్లుల్లి ముక్కలు ఫ్రై చేసుకోవాలి.
ఒక మీడియం ఉల్లిపాయ కట్ చేసుకుని ముక్కలు, అది కూడా ఫ్రై చేసుకోవాలి, పావు కప్పు క్యారెట్ ముక్కలు, పావు కప్పు పచ్చి బఠాణి, కొంచెం సాల్ట్, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని, వేసి కొంచెం మగ్గితే సరిపోతుంది.
మనం కుక్కర్ మూత తీసి జావ ఉడికింది లేనిది ఒకసారి చూసుకొని సరిపోతే ఒక గ్లాస్ వాటర్ కలిపి కొంచెం జారుగా ఉండేలా చూసుకోవాలి. జావని ఉడికిన ముక్కల్లో వేసి ఉప్మా కలిపినట్టు కలుపుకోవాలి.
కానీ జారుగా మనకి సరిపడే కన్సిస్టెన్సీ చూసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా మిరియాల పొడి ఘాటుతో హెల్దీ ముక్కలు క్యారెట్, బటాని మనకి ఇష్టమైన వెజిటబుల్ పీసెస్ యాడ్ చేసుకుంటూ ఈ జావని తీసుకుంటే హెల్తీగా ఉంటుంది.