Menthikura Tomato Pappu:ఎప్పటిలాగా కాకుండా కొత్తగా మెంతుకూర టమాటో పప్పు చేసుకోండి రుచి అదిరిపోతుంది

Menthikura Tomato Pappu:ఎన్ని కూరగాయలున్నా, ఎన్ని వెరైటీస్ చేసుకున్నా ,వారంలో రెండు, మూడు రోజులైనా పప్పు స్పెషల్ ఉండాల్సిందే, వండి తీరాల్సిందే.మరి మెంతికూర టోమాటో పప్పు ఎప్పుడైనా ట్రై చేసారా?..లేదా అయితే ఇప్పుడే చేసేయండి.

కావాల్సిన పదార్ధాలు

కందిపప్పు - 1½ కప్పు

మెంతికూర – రెండు కట్టలు

టమాట – మూడు ( మీడియం సైజ్)

పచ్చిమిర్చి - 6

ఎండుమిర్చి -4

పసుపు - 1 టీస్పూన్

వెల్లుల్లి రెబ్బలు – 7 లేదా 8

చింతపండు - కొద్దిగా

ఆయిల్ – 2 టెబుల్ స్పూన్

ఉల్లిపాయ – మీడియం సైజ్

తాలింపు గింజలు – 1 టేబుల్ స్పూన్

కరివేపాకు రెమ్మ - 1

ఉప్పు – తగినంత

తయారీ విధానం

1. స్టవ్ పై పాన్ పెట్టుకుని కందిపప్పును దోరగా వేయించుకోవాలి.

2. తగినన్ని నీళ్లు పోసి వేయించుకున్న కందిపప్పును శుభ్రంగా కడగండి.

3. వడకట్టిన పప్పులోకి మెంతికూర , టమాటలు , పసుపు, వేసుకుని, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని,మీడియం ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి.

4. ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి.

5. ఉడికించిన పప్పును , పప్పుగుత్తి సాయంతో మెత్తగా రద్దుకోవాలి.

6. ఇందులోకి చింతపండు నీళ్లు కలుపుకుని,తగినన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.

7. వేరొక బాండి స్టవ్ పై పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని , నూనె వేడెక్కిన తర్వాత, తాలింపు గింజలు , పొడుగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, వేసుకుని అందులోకి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి.

8. ఒక నిముషం వరకు కలుపుతూ , ధనియాల పొడి కూడా యాడ్ చేసి, పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి.

9. ఇప్పుడు ఉడికించిన పప్పు తాలింపులో వేసుకుని, తగినన్ని నీరు పోసి, రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి.

10. మీడియం ఫ్లేమ్ పై మరో 5 నిముషాలు ఉడికించుకుంటే , మెంతికూర టమాటో పప్పు రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top