Immunity Booster: పోపుల పెట్టె ఔషధాల గని.. ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయంటే..

1 minute read
Immunity Booster:పప్పులో,చారులో తిరగమోత పెట్టేసాక పోపుల పెట్టె గురించి మనం పట్టించుకోము. అందులో వస్తువుల గురించి అసలు ఆలోచించం. ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్య వస్తే చటుక్కున డాక్టర్ దగ్గరకో,మెడికల్ షాప్ దగ్గరకో వెళ్ళతాము. 

కానీ మన వంటింట్లో ఓ పక్కగా ఒదిగి ఉండే పోపుల పెట్టె గురించి అసలు పట్టించుకోము. అలా కాకుండా ఒకసారి పోపుల పెట్టిను గుర్తుకు తెచ్చుకోండి. ఎన్నో వైద్య విలువలను కలిగిన ఈ చిన్నపాటి మందుల షాప్ చేసే మాయాజాలం తెలుసుకుందాము.

జీలకర్ర -
తిరగమోత పెట్టిన ప్రతిసారి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒక స్పూన్ జీలకర్రలో చిటికెడు అల్లం పొడి కలిపి తింటే అజీర్ణం దరి చేరదు. గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల జీలకర్ర,కొద్దిగా ఇంగువ వేసి మరిగించి అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా రాళ్ల ఉప్పు కలిపి త్రాగితే గ్యాస్ బాధ నుండి విముక్తి పొందవచ్చు.

జీలకర్రలో కొద్దిగా తేనే కలిపి ముద్దగా నూరి వేడి పొక్కుల మీద అప్లై చేసి ఒక అరగంట తర్వాత కడగాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేస్తే వేడి పొక్కుల బాధ నుండి తప్పించుకోవచ్చు.

ఆవాలు 
ఇవి లేకుంటే తిరగామోతకు అసలు రుచే ఉండదు. రక్త పోటు తక్కువగా ఉన్నవారికి ఆవాలు మందుగా ఉపయోగపడుతుంది. దీన్ని ఆహార పదార్దాల ద్వారా తరచుగా వాడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మైగ్రేన్ తలనొప్పి తగ్గించటంలో కూడా బగ సహాయపడుతుంది.

కండరాల నొప్పికి ఆవాల ముద్ద బాగా పనిచేస్తుంది. నొప్పి ఉన్న ప్రాంతంలో ఆవాల ముద్దను పట్టీలా వేసి బాగా ఆరనిచ్చి శుభ్రంగా కడిగేయాలి. చర్మ సంబంధ సమస్యలు తలెత్తినప్పుడు ఆ ప్రాంతంలో ఆవాల ముద్దను అప్లై చేస్తే మంచి పలితం కనపడుతుంది.

పసుపు 
పదార్దాలకు మంచి రంగును,రుచిని తీసుకువస్తుంది. దీనిలోని యంటిసెప్టిక్ లక్షణాలు గాయాలను,పుండ్లను త్వరగా మానేల చేస్తుంది. పిల్లలకి ఇచ్చే ఆహార పదార్దాలలో దీన్ని ఎక్కువగా వాడటం వలన వారు లుకేమియా బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

జీర్ణ ప్రక్రియను మెరుగుపరచి,అదిక బరువు తగ్గటానికి దోహదం చేస్తుంది. డీఫ్రేషణ్ కి ఇచ్చే మందులలో చైనీయులు ఎక్కువగా పసుపును ఉపయోగిస్తారు. గొంతు బాగా నొప్పి అన్పించినప్పుడు రెండు కప్పుల నీటిలో ఒక స్పూన్ పసుపు వేసి ఆ నీటిని పుక్కిలిస్తే మంచిది. బాగా జలుబు చేసిన సందర్భంలో వేడినీటిలో పసుపు వేసి ఆవిరి పడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top