How Much Oil Per Day:రోజుకి ఎన్ని టీ స్పూన్ల నూనె తీసుకోవాలంటే.. నిపుణులు చెప్పిన ప్రకారం..

How Much Oil Per Day: ఉప్పు లేని పప్పు,నూనె లేని కూర తినటం ఎవరికైనా కష్టమే. అయితే వంటలలో ఎంత పరిమాణంలో నూనెను వాడాలి. అన్న దాని మీద ఖచ్చితమైన ప్రమాణాలు లేవు. నూనె తోనే కూరలకు రుచి వస్తుందని ఎంత నిజమో దీని వాడకం ఎక్కువైతే శరీరంలో కొవ్వు పేరుకు పోతుందనేది కూడా అంతే నిజం. 

కొవ్వు కొంత వరకు ఆరోగ్యానికి మేలు చేసిన స్థాయి మించితే మాత్రం ప్రాణాంతకం అవుతుంది. దీనికి తోడు అధిక బరువు తగ్గించుకోవాలంటే నూనె వాడకాన్ని తప్పనిసరిగా నియంత్రించుకోవాలి.

పెద్దలు రోజు మొత్తంలో ఐదు నుంచి ఆరు టీ స్పూన్ల నూనెను తీసుకుంటే సరిపోతుందని డైటీషియన్స్ చెప్పుతున్నారు. చిన్న పిల్లల విషయానికి వచ్చేసరికి రెండు నుంచి మూడు స్పూన్లు వాడితే మంచిది. 

ఒక గ్రాము నూనెలో తొమ్మిది క్యాలరీలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూరలలో,ఆహార పదార్దాలలో నూనెను వినియోగించాలని నిపుణులు చెప్పుతున్నారు.

మాంసాహారం తయారికి సహజంగానే నూనె ఎక్కువగా పడుతుంది. కాబట్టి దీని వాడకాన్ని తగ్గిస్తే మంచిది. మాంసాహారాన్ని వండే సమయంలో నూనె బదులు ఎక్కువ మోతాదులో నీటిని ఉపయోగిస్తూ తయారుచేసుకోవాలి. 

అలాగే మసాలాలను కూడా బాగా తగ్గించాలని నిపుణులు చెప్పుతున్నారు. రోజువారీ ఉపయోగానికి రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ చాలా మంచిదని నిపుణులు చెప్పుతున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top