Hair Growth Tips:రాత్రి మిగిలిపోయిన అన్నంను కొంత మంది ఫ్రిజ్లో పెట్టి మరసటి రోజు ఉదయం వేడి చేసుకుని తింటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం డస్ట్ బిన్ లో పాడేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పిన చిట్కా తెలుసుకుంటే రాత్రి మిగిలిపోయిన అన్నం పాడేయకుండా ఉపయోగిస్తారు.
రాత్రి మిగిలిన అన్నంతో జుట్టును ఒత్తుగా, పొడవుగా మార్చుకోవచ్చు. మిక్సీ జార్ లో రాత్రి మిగిలిన అన్నం ను నాలుగు నుంచి ఐదు స్పూన్లు వేసుకోవాలి. ఆ తర్వాత రెండు మందార ఆకులు, ఒక మందార పువ్వు, ఒక స్పూన్ మునగాకు పొడి, ఒక కప్పు అలోవెరా జెల్, రెండు స్పూన్ల పెరుగు వేసి మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమంలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా తెల్ల జుట్టు త్వరగా రాకుండా కూడా ఉంటుంది. చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి పొడవైన జుట్టును సొంతం చేసుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.