Skin Care Tips:వయసు పెరిగే కొద్దీ ముఖంలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ముడతలు, వృద్ధాప్య ఛాయలు, నల్లని మచ్చలు వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనలో చాలా మందికి వయసు పైబడిన యవ్వనంగా ఉండాలని కోరిక ఉంటుంది.
ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాని ఫాలో అయితే 60లో కూడా యవ్వనంగా చర్మం మెరుస్తూ ఉంటుంది. దీనికోసం మిక్సీ జార్ లో అరకప్పు టమాటా ముక్కలు, అరకప్పు బొప్పాయి ముక్కలు, అరకప్పు పచ్చి పాలు, అరకప్పు rose వాటర్ వేసి మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి.
మిక్సీ చేసిన ఈ పేస్ట్ నుండి జ్యూస్ సెపరేట్ చేయాలి. ఈ జ్యూస్ లో పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ జ్యూస్ ని ఐస్ ట్రే లో పోసి ఫ్రిజ్ లో పెట్టి ఐస్ క్యూబ్స్ గా తయారు చేసుకోవాలి.
ఒక ఐస్ క్యూబ్ తీసుకుని ముఖాన్ని స్మూత్ గా రబ్ చేయాలి .ఆ తర్వాత పావుగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముడతలు, వృద్ధాప్య ఛాయలు అన్ని మాయమై చర్మం బిగుతుగా కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే ఈ రెమిడి డార్క్ సర్కిల్స్ నివారించడానికి కూడా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.